టీడీపీ పాలనలో చేసిన అప్పులతో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. టిడ్కో ఇళ్లపై మంత్రి ఆదిమూలపు సురేష్ సమీక్ష జరిపారు. అన్ని వసతులతో టిడ్కో ఇళ్ళు పూర్తి చేస్తాం. గతంలో టీడీపీ అప్పులు మిగిలిస్తే వాటిని తీరుస్తున్నాం. డిసెంబరుకు 2.62 లక్షల ఇళ్ళు పూర్తికి ప్రణాళిక రెడీ చేశామన్నారు.
గత ప్రభుత్వాల మాదిరి అర్భాటాలకు పోయి అప్పులు చేసి ప్రజా సమస్యలను గాలికి వదలటం లేదు. మాట ఇస్తే దానికి కట్టుబడి పని చేయటం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నైజం. పట్టణాల్లోని పేదలకు ఇళ్లు నిర్మిస్తామని మాటలు చెప్పిన గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో హడావుడి చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసం ఇళ్ల నిర్మాణం పేరుతో దాదాపు మూడు వేల కోట్లకు పైగా అప్పులు మిగిల్చిందన్నారు మంత్రి సురేష్.
ఎటువంటి మౌలిక వసతులు కల్పించకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నామని టీడీపీ గొప్పలు చెప్పుకుంది. టీడీపీ చేసిన తప్పిదాలను ఇప్పుడు సరిదిద్దాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో చేసిన అప్పులను ఓవైపు తీరుస్తూనే మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టి దాదాపు రూ. 4200 కోట్ల అదనపు భారాన్ని భరిస్తున్నాం అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.
Read Also: Beast: డైరెక్టర్‌పై విజయ్ తండ్రి ఆగ్రహం.. దాన్ని సినిమా అంటారా..?
