NTV Telugu Site icon

Actor Satpagiri: త్వరలోనే టీడీపీలోకి సప్తగిరి.. పోటీకి సిద్ధంగా ఉన్నా

Saptagiri Tdp

Saptagiri Tdp

Actor Saptagiri Gives Clarity On His Political Entry: తన రాజకీయ అరంగేట్రం గురించి సినీ నటుడు సప్తగిరి స్పష్టతనిచ్చారు. తనకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిన మాట వాస్తవమేనని.. మరో 10 లేదా 15 రోజుల్లోనే గుడ్ న్యూస్ వస్తుందని క్లారిటీ ఇచ్చారు. తిరుపతిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సప్తిగిరి మీడియాతో మాట్లాడుతూ.. తాను చంద్రబాబు అభివృద్ధి, విజన్ చూస్తూ పెరిగానని అన్నారు. ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్‌ను తాను కలిశానని, కాసేపు ఆయనతో చర్చలు జరిగాయని, ఆయన ఆశీర్వాదాలు కూడా తీసుకున్నానని చెప్పారు. టీడీపీ నుంచి చిత్తూరు జిల్లాలోని పార్లమెంటుకు గానీ, అసెంబ్లీకి గానీ తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

Health Tips : మగవారు ఈ వ్యాయామాలు చేస్తే ఆ శక్తి పెరుగుతుంది..

తాను పుట్టింది చిత్తూరు జిల్లాలోని ఐరాల ప్రభుత్వ ఆసుపత్రిలోనేనని.. చిత్తూరు జిల్లాలో తనకు సంబంధించిన మెమోరీస్ చాలా ఉన్నాయని సప్తిగిరి చెప్పారు. తనకు పేదల కష్టాలేంటో తెలుసని.. పేదలకు సేవ చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా తనవంతు కృషి చేస్తాననని పేర్కొన్నారు. ఏ విధంగా అయితే తాను చిత్రపరిశ్రమలో ఓ క్రమశిక్షణతో ఈ పేరు సంపాదించుకున్నానో.. రాజకీయాల్లోనూ అదే విధంగా నిజాయితీతో, నిబద్ధతతో, క్రమశిక్షణతో పని చేస్తానని అన్నారు. చంద్రబాబు, లోకేష్ ఏమీ ఆదేశిస్తే.. అది చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. టీడీపీ అధికారంలోకి రావడానికి తన సేవలు అవసరమైతే.. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పుకొచ్చారు. సినిమాల వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని.. రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాలు చేస్తానని స్పష్టం చేశారు.

YV Subba Reddy: టీడీపీ ట్రాప్‌లో బీజేపీ.. అమిత్ షా వ్యాఖ్యలకు సుబ్బారెడ్డి కౌంటర్