తూ:గో జుల్లా పెద్దాపురం పోలీసుల నిర్వాకంతో గంజాయి కేసులో నిందితుడు పరారయ్యాడు. ఓ పాత నేరస్తుడు పెద్దాపురం మండలం తూర్పుపాకల గ్రామంలో గంజాయితో దొరికాడు. ఆ నేరస్తుడిని స్టేషన్ కు తరలిస్తుండగా ఏఎస్ఐ బైక్ పై నుంచి దూకి పారిపోయాడు. అయితే పట్టుకున్న గంజాయిని స్టేషన్ కు తరలించారు పోలీసులు. పాత నేరస్తుడు పరారు కావడంతో ఖంగుతిన్న పోలీసులు.. దొరికింది గంజాయి కాదు చెరకు పిప్పి అంటూ కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై విచారించేందుకు రంగంలోకి దిగ్గారు పోలీస్ ఉన్నతాధికారులు. మూడు రోజుల క్రితం జగ్గంపేట పోలీసుల కస్టడీ నుంచి పరారయిన గంజాయి కేసులో నిందితుడి ఘటన మరువక ముందే.. ఇప్పుడు మరోసారి పోలీసులకు ఘలక్ ఇచ్చింది ఈ సామర్లకోట ఘటన.