NTV Telugu Site icon

Tirupati: కళ్యాణ మండపంలో చోరి.. బంగారం, నగదుతో ఉడాయించిన మహిళలు

Untitled 2

Untitled 2

Tirupati: అమ్మాయి కైనా, అబ్బాయికైనా పెళ్లి కుదిరిందంటే ఆ కుటుంభ సభ్యులు దగ్గర బంధువుల నుండి దూరపు చుట్టాల వరకు అందర్నీ పిలుస్తారు. అలానే స్నేహితులతో పాటు తెలిసిన వాళ్ళను కూడా ఆహ్వానిస్తారు. కాగా పిలుపును అందుకున్న వాళ్ళు పెళ్ళికి వస్తారు. అయితే పెళ్లి పందిరి లోకి విచేస్తున్నది ఆహ్వానం అందుకున్న అతిధుల లేక అందినంత దోచుకెళ్లే దొంగల అని పెళ్లి నిర్వహణ చూస్తున్న పెళ్లి పెద్దలు గమించుకోవాలి. ఎందుకంటే కేటుగాళ్లు మాటు వేసి ఉంటారు. అలా గమనించక పోతే ఇలా దొరికన కాడికి దోచుకు పోతారు. పెళ్లికి అతిధులుగా వచ్చి బంగారం, నగదును, సెల్ ఫోన్ దొంగిలించి పరారైయ్యారు ఇద్దరు మహిళలు. ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది.

Read also:Delhi: ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ముగ్గురు..

వివరాల లోకి వెళ్తే.. తిరుపతి లోని తిరుచానూరు లోని ఓ కళ్యాణ మండపంలో దొంగతనం జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని మహిళలు ఓ కుర్రాడితో పెళ్ళికి అతిధులుగా విచ్చేసారు. కాగా మండపంలో పెళ్లి హడావిడి మొదలైనది. ఈ నేపథ్యంలో దొరికిందే ఛాన్స్ అనుకున్న ఆ గుర్తు తెలియని మహిళలు 70గ్రాముల బంగారం, రూ.40వేలు నగదు గల బ్యాగు, సెల్ ఫోన్ ను దొంగిలించి పరారైయ్యారు. దీనితో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. అనంతరం సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళని గుర్తించారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు డిఎస్పీ యశ్వంత్ ఆధ్వర్యంలో మహిళలు కోసం గాలిస్తున్నారు.