Alluri: కాలం మారిన.. సాంకేతికత పెరిగిన కొందరి జీవితాలు మాత్రం మారడం లేదు. రాకెట్ యుగంలో అంతరిక్షాన్ని సందర్శించి వస్తున్న ఈ రోజుల్లో కొందరు ఊరి పొలిమేర దాటడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన మార్గం లేక కనీస వైద్యం అంధక ప్రాణాలను కోల్పోతున్నారు. సరైన రహదారి లేక కాలినడకన డోలీలో నిండు గర్బిణిని మోసుకెళ్లిన ఘటనలు, అనారోగ్యంతో సరైన సదుపాయాలు లేక కాలినడకన ఆసుపత్రికి వెళ్లేసరికి మృతి చెందిన సంఘటనలు కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా అల్లూరి ఏజెన్సీలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. పెదబయలు మండలం లోని మారుమూల కుంబర్ల గ్రామానికి చెందిన అరడ కృష్ణ(10) అనే విద్యార్థి పెదబయలు ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నారు.
Read also:Russia: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. మధ్యవర్తిత్వం వహిస్తున్న చైనా,రష్యా..
కాగా దసర సందర్భంగా పాఠశాలకు సెలవలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కృష్ణ దసరా సెలవలకి ఇంటికి వచ్చాడు. అయితే ఉన్నటుండి కృష్ణ అస్వస్థతకు గురైయ్యారు. దీనితో ఆ గ్రామానికి రహదారి సరిగా లేనందున బంధువులు డోలీలో కృష్ణను ఉంచి అతి కష్టం మీద గ్రామం నుండి అయిదు కిలోమీటర్ల దూరం మోసుకుంటూ దగ్గరలో ఉన్న గోమంగి తరలించారు. అయితే వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం లేకుండా పోయింది. కృష్ణను పరీక్షించిన వైద్యులు ఆ బాలుడు చనిపోయినట్టు తెలియ చేశారు. దీనితో బంధువులు తిరిగి మృత దేహాన్ని డోలీలో మోసుకుంటూ ఇంటికి తెలుసుకువెళ్లారు. కుమారుడి మరణముతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూన్నారు. సరైన రహదారి సౌకర్యం లేక, ఆశ్రమాల్లో భద్రత లేక తమ బిడ్డను కోల్పోయామని బందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.