A Man Named Mani Kumar Dumped Vizag People In The Name Of Chit Fund: ఈరోజుల్లో జనాలు చాలా అప్డేట్ అయ్యారు. మోసాలకు పాల్పడే మోసగాళ్లను ముందే పసిగట్టేసి, వారి బారిన పడకుండా తప్పించుకుంటున్నారు. ఇలాంటి రోజుల్లో కూడా కొందరు జనాలకు శఠగోపం పెట్టి.. భారీ మోసాలకు పాల్పడుతున్నారు. జనాలకు తెలియకుండా.. చాప కింద నీరులాగా డబ్బుల్ని సునాయాసంగా దోచేసుకుంటున్నారు. తాము మోసపోతున్నామన్న విషయం జనాలకు తెలియకుండా.. వెన్నె పూస్తున్నారు. ఇప్పుడు ఓ ఘరానా మోసగాడు కూడా విశాఖ ప్రజలకు అలాగూ వెన్నె రాసి.. ఏకంగా నాలుగు కోట్లతో పరారయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
విశాఖపట్నంలోని వన్ టౌన్‌లో మణికుమార్ అనే వ్యక్తి 9 స్టార్ ఎంటర్‌ప్రైజెస్ షాపుని నిర్వహిస్తున్నాడు. ఇతడు చిట్టీలు వేయడంలో ఫేమస్ కావడంతో.. ఇతని వద్ద చిట్టీలు వేసేందుకు చాలామంది ముందుకొచ్చారు. నమ్మకస్తుడన్న కూడా పేరు కూడా రావడంతో, పెద్ద మొత్తంలోనే చిట్టీలు వేయడం జరిగింది. అయితే.. కొద్దిరోజులుగా అతడు షాప్ తెరవలేదు. ఫోన్ చేసినా స్పందన లేదు. ఏదో పని మీద బయటకు వెళ్లి ఉండొచ్చని, ఏదో ఒక రోజు తప్పకుండా వస్తాడులే అని, కొన్ని రోజుల పాటు జనాలు మౌనంగానే ఉన్నారు. చివరికి తాము మోసపోయామన్న విషయాన్ని గ్రహించి.. బాధితులు లబోదిబోమంటున్నారు. అతని షాప్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేసి, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మణికుమార్ సుమారు నాలుగు కోట్లతో పరారైనట్టు తేలింది. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.