A Man Cheated Businessmen In Anantapur In The Name Of Delivery Services: కొడితే కుంభస్థలమే బద్దలుకొట్టాలి అన్నట్టు.. ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. నిప్పీ డెలివరీ సర్వీసు పేరుతో.. ఏకంగా ప్రముఖులకే కుచ్చటోపీ పెట్టాడు. రూ.70 లక్షలకు పైగా సరుకుతో ఉడాయించాడు. ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కడపలోని రూకవారిపల్లికి చెందిన పసుపులేటి అంకుశం 24 రోజుల క్రితం ఓ గోదాంలో నిప్పీ డెలివరీ సర్వీసు పేరుతో వ్యాపారం ప్రారంభించాడు. నగరంలోని ప్రముఖ వ్యాపారులను పిలిపించి, ఘనంగా ప్రారంభోత్సవాన్ని జరిపించాడు. అతనిచ్చిన ఈ బిల్డప్ చూసే.. ప్రముఖులు అతని ట్రాప్‌లో చిక్కుకున్నారు.
Dwayne Bravo Six: డ్వేన్ బ్రావో భారీ సిక్సర్.. వీడియో చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!
ఇక ప్రారంభోత్సవం అనంతరం అంకుశం తన వ్యాపారం గురించి వారికి వివరించాడు. తనతో కలసి వ్యాపారం చేస్తే.. ఖర్చులు తగ్గి, భారీగా ఆదాయం వస్తుందని చెప్పాడు. సరుకును విక్రయించిన తర్వాత తన కమీషన్ మాత్రమే పట్టుకొని, మిగులు మొత్తాన్ని అందజేస్తానని పేర్కొన్నాడు. అతడిచ్చిన బిల్డప్, చెప్పిన మాటలు చూసి.. ప్రముఖులు టెంప్ట్ అయ్యారు. అతనితో వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ వద్ద ఉన్న సరుకుల్ని అప్పగించారు. ఆ సరుకులతో గోదాం మొత్తం నిండిపోవడంతో.. అంకుశం బాగానే వ్యాపారం చేస్తున్నాడని వ్యాపారులు మురిసిపోయారు. తమకు ఇక డబ్బే డబ్బు వస్తుందని ఆశించారు. కానీ.. అంకుశం రాత్రికిరాత్రే ప్లేటు ఫిరాయించడం చూసి, వాళ్లు ఖంగుతిన్నారు.
Bhumana Karunakar Reddy: తిరుపతిపై పవన్ దాడికి దిగుతున్నట్టుంది.. ఎమ్మెల్యే భూమన ఫైర్
తన గోదాం నిండిన తర్వాత అంకుశం లారీలకొద్దీ సరుకుని తీసుకుని, రాత్రికిరాత్రే మాయమైపోయాడు. ఆ సరుకు విలువ మొత్తం రూ.70 లక్షలు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన వ్యాపారులు.. నేరుగా అతని ఇంటికి వెళ్లారు. అయితే.. కుటుంబసభ్యులు ఎదురుదాడికి దిగడంతో, గత్యంతరం లేక వ్యాపారులు అనంతపురం తిరిగొచ్చి పోలీసులకు తమకు జరిగిన మోసాన్ని వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. నెల్లూరులో రూ.3 కోట్లు, కర్నూలులో రూ. కోటికి పైగా వ్యాపారులు.. అంకుశం చేతిలో మోసపోయినట్లుగా తేలింది.