Site icon NTV Telugu

Fake Documents: నూజివీడులో నకిలీ డాక్యుమెంట్స్తో రిజిస్ట్రేషన్ చేసేందుకు ముఠా ప్రయత్నం..

Nuzivedu

Nuzivedu

Fake Documents: ఏలూరు జిల్లాలోని నూజివీడులో నకిలీ డాక్యుమెంట్స్ తో రిజిస్ట్రేషన్ చేసేందుకు ముఠా ప్రయత్నం చేసింది. ఈ విషయం మంత్రి పార్థసారధి దృష్టికి వెళ్ళటంతో విచారణకు ఆదేశాలు జారీ చేశారు. 66- 2 సర్వే నెంబర్ గల భూమికి 25. 46 ఎకరాలను నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ కు ముఠా తెగబడింది. నూజివీడు తహసీల్దార్ డీవీ ఎల్లారావు సంతకాన్ని ఫోర్జరీ చేసిన ముఠా.. నకిలీ పొజిషన్ సర్టిఫికెట్ను తయారు చేసిన వట్టిగుడి పాడు గ్రామానికి చెందిన నాగరాజు వ్యక్తి.. రిజిస్టార్ కార్యాలయంలో స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల ఫీజు 17 లక్షల రూపాయల డీడీని ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడుకు చెందిన ఎం శ్రీను బాబు పేరుతో సదరు ముఠా చలానా తీసింది.

Read Also: Delhi : 30 బేస్‌మెంట్లు సీలు, 200 మందికి నోటీసులు… కోచింగ్ సెంటర్ల నియంత్రణకు కొత్త చట్టం

దీంతో భూ యజమాని మంత్రికి ఫిర్యాదు చెయ్యటంతో నకిలీ ముఠాపై గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్యాప్తుకు ఆదేశించారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version