NTV Telugu Site icon

Father Abuse: విశాఖలో దారుణం.. కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రి

Untitled 15

Untitled 15

Visakhapatnam: పిల్లల బాగోగులు చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. కన్న వాళ్ళు ఎంత కష్టపడినా వాళ్ళ పిల్లలు మాత్రం బాగుండాలి అని ఆరాటపడుతుంటారు. పిల్లలు బాగుంటే చాలని సర్వం పిల్లల కోసం త్యాగం చేస్తారు. ఆడపిల్లల విషయానికి వస్తే ముఖ్యంగా తండ్రి అన్నీ తానై అపురూపంగా చూసుకుంటాడు. ఒక వ్యక్తి ఎంతటి కసాయి వాడైనా కన్న కూతురిని మాత్రం మహారాణిలా భావిస్తాడు . కింద పెడితే చీమలు కుడతాయి.. పైన పెడితే గ్రద్దలు ముడతాయి అన్నట్లు అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. అయితే కంటికి రెప్పగా కాపాడాల్సిన తండ్రే కాలయముడైయ్యాడు. వావి వరసలు మర్చిపోయి మానవ మృగంలా ప్రవర్తించాడు. కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాలపడ్డారు.

Read also:Varun Sandesh: ‘చిత్రం చూడర’ అంటున్న వరుణ్ సందేశ్.. ఈసారైనా?

ఈ ఘటన విశాఖలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లా లోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో హనుమంతు శివ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సభ్య సమాజం తలదించుకునేలా అతను ప్రవర్తించాడు. రక్తం పంచుకు పుట్టిన కూతురు అనే విషయాన్ని కూడా మర్చిపోయాడు. కూతురుకి ఎలాంటి కష్టం కలగకుండా కాపాడాల్సిన తండ్రై ఉండి కామంతో కళ్ళు మోసపోయి కన్న కూతురి పైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో స్థానికుల సహాయంతో బాధితురాలు మల్కాపురం పోలీసులను ఆశ్రయించింది. దీనితో ఈ వార్త వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.