A Boy Molested Young Girl In Lodge In Drunken Position: ఆంధ్ర రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికని మద్యం తాగించి, లాడ్జికి తీసుకెళ్లి, అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. గతంలో తనతో ఉన్న పరిచయాన్నే ఆసరాగా చేసుకొని, అతడు ఈ కీచకపర్వానికి పాల్పడ్డాడు. మరింత ఘోరం ఏమిటంటే.. ఈ దారుణంలో అతనికి ఇద్దరు స్నేహితులు కూడా సహకరించారు. చివరికి బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Pushpa 2: స్వర్ణముఖి నదిలో భారీ ఛేజ్… సీన్ పీక్స్ అంతే…
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంకు చెందిన సతీష్ అనే యువకుడికి కొంతకాలం క్రితం ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. అప్పట్నుంచే ఆ బాలికపై కన్నేసిన అతగాడు.. మంచివాడిలాగా నటిస్తూ, ఆమెకు దగ్గరయ్యాడు. ఆమెని లోబరుచుకునేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం తన స్నేహితులైన కళ్యాణ్, మణికంఠలకు తెలియజేశాడు. దీంతో.. వాళ్లు అతనికి సహకరించారు. మద్యం తాగించి, లాడ్జికి తీసుకెళ్లి, అక్కడ అత్యాచారం చేయమని సలహా ఇచ్చారు. వాళ్లు చెప్పినట్టుగానే.. కలవాలనుందని ఆ బాలికను ఓ ప్రాంతానికి పిలిపించాడు. ఆమెకు తెలియకుండా.. మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన తర్వాత ఆమె మత్తులోకి జారుతోంది.
Guillain Barre Syndrome: విశాఖలో వెలుగు చూసిన అరుదైన వ్యాధి.. ఏకంగా 70 రోజుల పాటు..
అప్పుడు సతీష్ ఆ బాలికని తీసుకొని, లాడ్జికి వెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తులో ఉన్న ఆ బాలిక అతడ్ని ప్రతిఘటించలేకపోయింది. మత్తు నుంచి కోలుకున్న తర్వాత సతీష్ పాల్పడ్డ దారుణం తలచుకొని కుంగిపోయిన ఆ బాలిక.. తల్లిదండ్రులకు విషయం తెలిపింది. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు రంగంలోకి దిగి, సతీష్‌ని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై 376 పోక్సో కేసు నమోదు చేశారు. అతనికి సహకరించిన ఇద్దరు స్నేహితులు పరారీలో ఉండగా.. వారికోసం గాలిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపడంతో.. నిందితులపై కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.