Site icon NTV Telugu

Child Marriage: 62 ఏళ్ల అధికార పార్టీ నేత నిర్వాకం.. 16 ఏళ్ల బాలికతో పెళ్లి..!

Child Marriage

Child Marriage

శ్రీ సత్య సాయి జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ నేత సభ్యసమాజం సిగ్గుపడేలా చేశాడు.. బుక్కపట్నం మండలం కృష్ణాపురంలో పదహారేళ్ల బాలికలను పెళ్లి చేసుకున్నాడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన గ్రామ కమిటీ అధ్యక్షడు.. ఆయన వయస్సు 62 ఏళ్లు.. బాలికకు దయ్యం పట్టిందని ముందుగా నమ్మించిన ఆ వ్యక్తి.. ఆ తర్వాత క్షుద్ర పూజలు నిర్వహించాడు.. ఆ తర్వాత తన వల్లే నయమైందని బాధితురాలి తల్లిదండ్రులను నమ్మించి.. తన అసలు రంగును బయటపెట్టాడు.. ఆ బాలికపై అప్పటికే కన్నేసిన అతగాడు.. రహస్యంగా వివాహం చేసుకున్నాడు.. మూడు నెలల క్రితం రాప్తాడు మండలంలో రహస్యంగా వివాహం జరిగిపోయింది… అయితే, బాలిక సమీప బంధువు ఐసీడీఎష్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read Also: Asian Book of Records: ‘ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి స్థానం

దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. కృష్ణాపురానికి వెళ్లి ఆరా తీశారు.. అధికారులు వచ్చిన విషయాన్ని పసిగట్టి పరారయ్యాడు.. ఇక, బాధిత బాలికను ఉజ్వల హోంకు తరలించినట్లు ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి వెల్లడించారు.. కాగా, యల్లనూరు మండలం పాతపాలెం నుంచి కృష్ణాపురానికి వలస వచ్చి నిందితుడు.. జడల స్వామిగా స్థిరపడినట్టు స్థానికులు చెబుతున్నారు.. ఓవైపు క్షుద్ర పూజలు చేస్తూనే.. మరోవైపు.. రాజకీయంగా కూడా పలుకుబడి ఉంటే బాగుంటుందన్న ప్లాన్‌లో భాగంగానే.. అతగాడు అధికార పార్టీ నేతలకు చేరువయ్యాడని.. అలా గ్రామ అధ్యక్ష పదవి కూడా పొందాడని చెబుతున్నారు స్థానికులు.

Exit mobile version