Site icon NTV Telugu

TDP Formation Day: ఇవాళ టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం

తెలుగు జాతి ఆత్మగౌరవ జెండాని ఢిల్లీ వీధుల్లో ఎగురేశారు స్వర్గీయ నందమూరి తారకరామారావు. నేడు తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం. 1982 మార్చి 29న హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్సులో పార్టీ ప్రారంభించారు వెండితెర వేలుపు ఎన్టీఆర్. తెలుగుదేశం 40ఏళ్ల ప్రస్థానం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు.

హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు అధినేత చంద్రబాబు.అమరావతి కేంద్రంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు నారా లోకేష్. సాయంత్రం 4గంటలకు హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లో పార్టీ ప్రకటించిన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సును సందర్శించనున్నారు చంద్రబాబు, తెలుగుదేశం నేతలు. సాయంత్రం 5గంటలకు ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పిస్తారు చంద్రబాబునాయుడు. సాయంత్రం 6గంటలకు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో జరిగే పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గొంటారు చంద్రబాబు.

https://ntvtelugu.com/cpi-narayana-comments-on-ntr-and-chandrababu/

అమరావతి పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ 40 వసంతాల వేడుకల్లో పాల్గొంటారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుండి టీడీపీ కేంద్ర కార్యాలయం వరకూ జరిగే బైక్ ర్యాలీలో పాల్గొంటారు లోకేష్. సాయంత్రం గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు లోకేష్. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ కడప నుంచి కర్నూలు వరకూ వాడవాడలా టీడీపీ నేతలు పార్టీ జెండా ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొంటారు. బైక్ ర్యాలీలతో హోరెత్తించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తెలుగుదేశం పార్టీ పేరుని ప్రకటించడానికి హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కి బయలుదేరిన ఎన్టీరామారావు (ఫైల్ షాట్)

Exit mobile version