New Beaches in Vizag: ఆంప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులను రప్పించడం, ఉపాధి కల్పనే లక్ష్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (జీఐఎస్) నిర్వహించేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.. ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కార్పొరేట్ దిగ్గజాలు విశాఖ చేరుకుంటున్నాయి.. ఇప్పటికే 12,000కిపైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి.. దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు విశాఖ నగరం ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది.. అయితే, అంతర్జాతీయ సదస్సుల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. కొత్త బీచ్ ల కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది..
Read Also: NBK 108: త్వరలో స్టార్ట్ అవ్వనున్న కొత్త షెడ్యూల్… జాయిన్ అవ్వనున్న కాజల్
విశాఖ తీరంలో నాలుగు కొత్త బీచ్ లను ఏర్పాటు చేస్తున్నారు.. సాగర్ నగర్, జోడుగుళ్ల పాలెం, మంగమారిపేట, తొట్లకొండ బీచ్‌లను అభివృద్ధి చేస్తోంది ప్రభుత్వం.. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి.. 25 కిలోమీటర్ల స్ట్రెచ్ లో కొత్త బీచ్ లు ఏర్పాటు చేస్తున్నారు.. అయితే, పనుల పురోగతిని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పరిశీలించారు.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి.. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ను మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు.. సీఎం వైఎస్ జగన్, కొంత మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు విడిది చేయనున్నారు.. ఇప్పటికే 12 వేల మంది వరకు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. సిటీలో బ్యూటీఫికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం.. రోడ్ల మరమ్మత్తులు, ఎలక్ట్రీషియన్ వర్క్ పూర్తి అయ్యాయి.. విశాఖ రాష్ట్ర రాజధాని అని ముఖ్యమంత్రి ఢిల్లీ సమావేశంలో స్పష్టం చేశారని గుర్తుచేశారు. హోటల్స్ లో దాదాపు వెయ్యి రూమ్‌లు రిజర్వ్ అయ్యాయని తెలిపారు. అయితే, విశాఖలో ప్రస్తుతం చేస్తున్న పనులు.. కేవలం సదస్సుల కోసం చేస్తున్న తాత్కాలిక ఏర్పాట్లు కావు.. విశాఖను రాష్ట్ర రాజధానిగానే ప్రాజెక్ట్ చేస్తాం అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.