NTV Telugu Site icon

గోదారోళ్లతో మాములుగా ఉండదు… అల్లుడికి 365 రకాల వంటకాలతో విందు

గోదావరి జిల్లాలంటే మర్యాదలకు మారు పేరు. సాధారణంగానే గోదావరి జిల్లాలలో అతిథులకు చేసే మర్యాదలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఇక సంక్రాంతి అల్లుళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాలా? ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా న‌ర‌సాపురంలో మ‌న‌వ‌రాలికి, ఆమెకు కాబోయే భర్తకు ఓ తాత‌య్య ఇచ్చిన విందు భోజ‌నం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: ఏపీలో సెలవులు పొడిగించే ఆలోచన లేదు: మంత్రి సురేష్

నర‌సాపురానికి చెందిన ఆచంట గోవింద్ నాగమణి దంపతుల కూతురు అత్యం మాధవి, వెంకటేశ్వరరావు దంపతుల ఏకైక కుమార్తె కుందవికి తణుకుకి చెందిన తుమ్మలపల్లి సాయికృష్ణతో ఇటీవ‌ల నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో కాబోయే దంపతులకు.. వ‌ధువు తాత‌య్య విందు ఏర్పాటు చేసి గోదారోళ్ల మ‌ర్యాద‌ను రుచి చూపించారు. సంక్రాంతి సందర్భంగా కాబోయే ఇంటి అల్లుడికి భారీ స్థాయిలో అతిథి మర్యాదలు చేశారు. ఏకంగా 365 రకాల వంటకాలతో విందు భోజనం వడ్డించారు. వీటిలో అన్నం, పులిహార, బిర్యానీ, దద్దోజనం వంటి వంటకాలతో పాటు, 30 రకాల కూరలు, వివిధ రకాల పిండివంటలు, 100 రకాల స్వీట్లు, 19 రకాల హాట్ పదార్థాలు, 15 రకాల ఐస్ క్రీంలు, 35 రకాల కూల్‌డ్రింక్‌లు, 35 రకాల బిస్కెట్లు, 15 రకాల కేకులు ఉన్నాయి. ఈ వంటకాలను కాబోయే అల్లుడు అలా అలా రుచి చూసి అత్తింటి వారు చూపిన మమకారానికి ఫిదా అయిపోయాడు.