NTV Telugu Site icon

Rains Alert: మరో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజులు వర్షాలు

Rains

Rains

Rains Alert: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారింది.. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది.. అయితే, దీని ప్రబాశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు చెబుతున్నారు.. ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు రాష్ట్రంలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.. ఇవాళ్టి నుంచి ఏపీలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. తమిళనాడు రాష్ట్రంలో ఈ వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది ఐఎండీ.. ఈ మధ్యే అటు తమిళనాడుతో పాటు.. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో తుఫాన్‌ బీభత్సం సృష్టించింది.. ఇక, మరో అల్పపీడనం ఇప్పుడు టెన్షన్‌ పెడుతోంది.

Read Also: TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఇవాళే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు విడుదల

Show comments