NTV Telugu Site icon

Driving Fine: డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే.. రూ. 20,000 జరిమానా

Headphones While Driving

Headphones While Driving

20 Thousand Fine For Riders If They Wear Earphones While Driving: ప్రస్తుత తరం యువత సెల్‌ఫోన్లకు ఎంతలా అలవాటు పడ్డారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కేవలం అవసరానికి వాడాల్సిన ఆ పరికరాన్ని.. తమ జీవితంలో ఒక భాగం అయ్యేంతలా విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. అసలు సెల్‌ఫోన్ లేకపోతే.. క్షణం కూడా ఉండలేమన్నంతగా అడిక్ట్ అయిపోయారు. చివరికి రహదారుల్లోనూ సెల్‌ఫోన్ చూసుకుంటూ నడుస్తున్నారే తప్ప.. వాహనాల్ని, మనుషుల్ని పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. ఏదైనా రూపంలో ప్రమాదం ముంచుకొస్తుందేమో? అనే భయం లేకుండా పోయింది. అంతెందుకు.. వాహనం నడుపుతున్నప్పుడు కూడా, ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌సెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తుంటారు. ఇలా హెడ్‌ఫోన్స్ పెట్టుకొని వాహనాలు నడుపుతున్నప్పుడు.. వెనకాల వచ్చే వాహనాల హార్న్ శబ్దం వినిపించదు. అప్పుడు అనుకోకుండా ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉంది. ఈ తరహా సంఘటనలు గతంలో చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

No Confidence Motion: ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. ఆమోదించిన లోక్‌సభ స్పీకర్

ఇకపై ఇలా జరగకుండా ఉండేందుకు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బైక్ మీద కానీ, కారులో కానీ, ఆటోలో కానీ.. ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌సెట్ పెట్టుకుంటే రూ.20,000 జరిమానా వేయనుంది. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకే.. ఏపీ ప్రభుత్వం ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే.. దీనికి సంబంధించిన వివరాలు మొత్తం రవాణా శాఖకు జారీ చేసినట్లు వర్గాలు వెల్లడించాయి. ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌సెట్ పెట్టుకొని వాహనదారులు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నారని.. ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలంటే, భారీ ఫైన్ వేయక తప్పదని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. కాబట్టి.. వాహనదారులారా? తస్మాత్ జాగ్రత్త! సరదా కోసమని చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుంటే మాత్రం.. జేబుకి భారీ చిల్లు పడే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తేలిగ్గా తీసుకోకుండా, తూ.చ. తప్పకుండా పాటిస్తే మంచిది.

Daggubati Purandeswari: బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతుంది.. ఉమ్మడి సీఎం అభ్యర్థిపై వారిదే నిర్ణయం