ఏపీలో రాజకీయాలు మరోసారి హిటెక్కాయి. టీడీపీ నేత పట్టాభి ఎపిసోడ్ తో గడిచిన రెండుమూడ్రోజులుగా టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సీన్ మారిపోయింది. ఎవరికీవారు తగ్గెదేలే అన్నట్లు వ్యహరిస్తుండటంతో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అయితే టీడీపీ తన సమస్యను ఆంధ్రప్రదేశ్ సమస్యగా చూపిస్తూ పోరాటం చేస్తుండటంతో ఆపార్టీకి ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించడం లేదు. ఇదే అదనుగా వైసీపీ సైతం టీడీపీపై ఎదురుదాడికి దిగుతోంది. దీంతో ఏపీలో పొలిటికల్ వార్ కు తెరలేచినట్లయింది.
పట్టాభి వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య అగ్గిరాజుకుంది. బంద్ లు, అరెస్టులు, కేసులు, మాటలదాడితో ఏపీ అట్టుకుపోయింది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండురోజ్రులుపాటు తమ టీడీపీ ఆఫీసులోనే నిరసన దీక్ష పూర్తి చేసుకున్నారు. అయితే టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని చంద్రబాబు నాయుడు బీజేపీకి దగ్గరయ్యేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతి అపాయిమ్మెంట్ ను చంద్రబాబు కోరినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే చంద్రబాబుకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఖరారైంది. సోమవారం నుంచి ఆయన రెండ్రోజులు ఢిల్లీలో పర్యటించారు. రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యల నెలకొందని చంద్రబాబు రాష్ట్రపతికి వివరించే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నారు. అయితే రాష్ట్రపతి విధించాలంటే అంతా ఈషామాషీ విషయం కాదు. దీంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన కేవలం పోలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నారనే టాక్ విన్పిస్తోంది.
ఈ పర్యటనలోనే ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్ షాను కలువాలని చంద్రబాబు భావిస్తున్నారు. వారి అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వీరిద్దరిలో ఏ ఒక్కరి అపాయింట్మెంట్ బాబుకు దొరికినా సీఎం జగన్ బీజేపీ పట్ల తన ఆలోచనను మార్చుకునే అవకాశం ఉందని టాక్. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కేంద్రంలోని బీజేపీకి అన్ని విషయాల్లో మద్దతు ఇస్తూ వస్తున్నారు. అయినా కేంద్రం నుంచి ఏపీకి సరైన సహకారం లభించడం లేదని సీఎం జగన్ భావిస్తున్నారు.
ఇలాంటి సమయంలో జగన్ కు వ్యతిరేకంగా బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయన ఊరుకునే ప్రసక్తే లేదని తెలుస్తోంది. ఇక రాబోయే రోజుల్లో జగన్ కు బీజేపీ అవసరం కంటే.. బీజేపీకే జగన్ అవసరం ఉండనుంది. దీంతో బీజేపీకి తాము మద్దతు ఇవ్వాలో లేదో ఢిల్లీ పెద్దల నిర్ణయానికే సీఎం జగన్ వదిలేసినట్లు కన్పిస్తోంది. ఢిల్లీలో చంద్రబాబు పర్యటనపై ఫోకస్ పెట్టిన వైసీపీ బీజేపీ పెద్దల తీరును నిషితంగా గమనిస్తోంది. బీజేపీ పెద్దలు వైసీపీకి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం పరిస్థితి వేరేలా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరీ ఢిల్లీ పెద్దలు ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తానేది మాత్రం వేచిచూడాల్సిందే..!