Kushboo: సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కుష్బూ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని కుష్బూ స్వయంగా తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు.. కోకిన్స్ బోన్ ( టెయిల్ బోన్ ) చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రికి వచ్చినట్లు ఆమె చెప్పారు.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నా త్వరలోనే కోలుకుంటానని తెలిపారు.. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు..
కుష్బూ తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగానే కాకుండా నిర్మాతగా కూడా పనిచేశారు. అయితే తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటున్నప్పటికీ మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు పదవి చేపట్టారు. నిత్యం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ప్రతిపక్షాలకు తనదైన రీతిలో మాటలను వదులుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు కుష్బూ. అయితే తాజగా ఆమె సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారుతోంది. తాను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆసుపత్రి బెడ్ పై ఫోటోను షేర్ చేశారు..
ప్రస్తుతం కుష్బూ ఇటు రాజకీయాలు, అటు సినిమాలతో ఫుల్ బీజీ గా ఉంటున్నారు. నటిగా సౌత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఆమె రాజకీయాలపై ఆసక్తితో 2010లో డీఎంకే పార్టీలో చేరారు. ఆ తర్వాత నాలుగేళ్లకు కాంగ్రెస్ పార్టీలోకి మారారు. 2020 వరకూ కాంగ్రెస్ లో పనిచేసిన కుష్బూ తర్వాత బీజేపీలో చేరారు. అప్పటి నుంచి బీజేపీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 2021 తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కుష్బూ పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత అధిష్టానం ఆమెకు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నామినేట్ చేసింది.. ఇక సినిమాలు, టీవీ షో లలో కూడా పాల్గొంటు బిజీగా ఉన్నారు..