దేశంలో రాష్ట్రపతి ఎన్నికల వేడి రాజుకుంటోంది. విపక్షాల నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేసేందుకు నిరాకరించారు జమ్మూ కశ్మీర్ నేత ఫరూఖ్ అబ్దుల్లా. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికలలో పోటీకి ఎన్సీపీ నేత శరద్ పవార్ అయిష్టత ప్రకటించిన సంగతి తెలిసిందే. మమతా బెనర్జీ నేతృత్వంలో విపక్షనేతల భేటీలో రాష్ట్రపతి ఎన్నికల కోసం ఫరూఖ్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీల పేర్ల పరిశీలించారు. కాశ్మీర్ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, కొన్నాళ్ళపాటు క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతానని వెల్లడించారు ఫరూక్ అబ్దుల్లా.
రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో, విపక్షాల అభ్యర్థిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే వుంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నాయకత్వంలో విపక్షనేతలు సమావేశమై రాష్ట్రపతి రేసులో ఫరూఖ్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీల పేర్లను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై తాను నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేతలతోనూ, కుటుంబ సభ్యులతోనూ చర్చించానని ఫరూఖ్ అబ్దుల్లా వెల్లడించారు. ప్రస్తుతం కాశ్మీర్ క్రియాశీలక రాజకీయాల్లో ఇంకా కొన్నాళ్లపాటు కొనసాగాల్సిన అవసరం వుందన్నారు. జమ్మూ కశ్మీర్ లో మెరుగైన పరిస్థితుల కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. గతంలోనూ శరద్ పవార్ ఇదే అభిప్రాయంతో వున్నారు. ఇక విపక్షాల ప్రతిపాదనల్లో వున్న గోపాలకృష్ణ గాంధీ ఒక్కరే వున్నారు. ఉమ్మడి అభ్యర్థి విషయంలో ఎలాంటి ఏకాభిప్రాయం లేదు. మరోసారి ఈనెల 21వ తేదీన విపక్షాలు మరోసారి భేటీ అయి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం వుందంటున్నారు.
Konda Surekha : ఎర్రబెల్లి పిచ్చి చేష్టలే నన్ను మంత్రిని చేశాయి
