కార్తీక మాసం వచ్చిందంటే ఉసిరికి మంచి డిమాండ్ ఉంటుంది.. ప్రస్తుతం వీటికి డిమాండ్ ఎక్కువగా ఉండటం తో రైతులు ఉసిరిని కార్తీకాల్లో కోతకు వచ్చే విధంగా పండిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో అన్నిరకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉసిరి సాగును రైతులు చేస్తున్నారు.. ఉద్యానవన పంటగా పండిస్తున్నారు రైతులు.. ఈ ఉసిరి సాగులో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. ఉసిరి సాగు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..
నీరు నిల్వ ఉండని నేలలు ఉసిరి సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల, క్షార లక్షణాలు కలిగిన భూముల్లో సైతం ఉసిరిని సాగు చేయవచ్చు. ఉదజని సూచిక 9.5 వరకు ఉన్న నేలల్లో పంటను వేయవచ్చు.. ఇంకా ఉసిరి సాగులో అనువైన రకాలను చూస్తే..
ఉసిరికాయ సాగులో అనువైన రకాలు..
ప్రస్తుతం అనేక వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో చకియా రకం, బెనారసి రకం, ఫ్రాన్సిస్ రకం, భవాని సాగర్ రకం , కాంచన్, కృష్ణ, ఆన్నంద్1,2రకం, యన్.ఎ7 రకాలను రైతులు సాగు చేస్తున్నారు.. ఇవి అధిక దిగుబడిని అందిస్తున్నాయి.. ఇక ఎకరాకు 160 మొక్కలు అవసరమౌతాయి. చెట్టుకి చెట్టుకి మధ్య 15 అడుగుల దూరం, వరుసల మద్య 15 అడుగుల దూరం ఉండేలా నాటుకోవాలి..
ఎరువుల యాజమాన్యం..
మొక్కలు నాటే ముందుగా 60 సెంటిమీటర్లు వెడల్పు, 60 సెంటి మీటర్ల పొడవు , 60 సెంటమిటర్ల లోతు గుంతలు తొవ్వి బాగా చివికిన (ఎరువుని 200 గ్రాముల సూపర్ ఫాస్పేట్, 50 గ్రాముల ఎండోసల్పాన్ పొడి కలిపి గుంతలలో ఉసిరి మొక్కలని నాటుకోవాలి. మొక్కలు నాటిన తరువాత అవసరాన్నిబట్టి సేంద్రియ ఎరువులు వాడాలి. మొక్కలు పెరుగుతున్న కొద్దీ ఎరువుల అవసరం కూడా పెరుగుతుంది.. అలాగే 10 ఏళ్లు కలిగిన మొక్కలకు 1. 5 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం , మరియు 0. 75 కిలోల ఫొటాష్ ఎరువులని వేసుకోవాలి..
నీటియాజమాన్యం..
ఉసిరి మొక్కలు నీటిని తట్టుకుంటాయి.. నీటియాజమాన్యం సవ్యంగా పాటిస్తే మొక్కలలో ఎదుగుదల బాగుంటుంది. తద్వారా దిగుబడులు సాధించవచ్చు. మొదటి మూడు సంవత్సరాల వరకు అవసరాన్నిబట్టి నీరు అందిస్తే మొక్కలు బాగా పెరుగుతాయి.. డ్రిప్ ద్వారా నీటిని అందిస్తే మంచి లాభాలను పొందవచ్చు..