NTV Telugu Site icon

Viral Video : ఓరి నాయనో.. పది లక్షల బైక్ పై ఫుడ్ డెలివరీనా..!

Zomato

Zomato

ఫుడ్ డెలివరీ చేస్తున్న ప్రముఖ యాప్ జోమాటో గురించి అందరికి తెలిసే ఉంటుంది.. నిత్యం ఏదొక వార్తతో వార్తల్లో నిలుస్తుంది.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ డెలివరీ బాయ్ పది లక్షల విలువైన బైకు పై ఫుడ్ డెలివరీ చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది.. జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ పాజిటివ్ లేదా నెగటివ్ సందర్భాల్లో వార్తల్లోకి వస్తుంటారు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటారు. ఇదేమి కొత్త కాదు. లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్‌గా మారుతోంది. అతను ఏకంగా రూ.10 లక్షల విలువైన బైక్‌పై ఫుడ్ డెలివరీ చేస్తుండటం ఆశ్చర్యపరుస్తోంది..

ఆ వైరల్ అవుతున్న వీడియోలో డెలివరీ బాయ్ ని ఓ వ్యక్తి బ్రతకడానికి ఏం చేస్తుంటారు అంటే.. అతను సమాధానం చెప్పిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. తాను జొమాటోలో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేస్తున్నానని, డుకాటి బైక్‌పై కూర్చున్న వ్యక్తి దర్జాగా చెప్పాడు.. కటింగ్స్, పెట్రోల్ పోగా నెలకు రూ.45,000 సంపాదిస్తున్నట్లు నిస్సంకోచంగా చెప్పేసాడు.. అంటే ఇది టెన్షన్ లేని లైఫ్.. ఆర్డర్ తీసుకున్నామా.. ఇచ్చామా.. డబ్బులు తీసుకున్నామా అంతే.. అంటూ అతను చెప్పడం విశేషం..

ఈ వీడియోను ఓ ఇంస్టాగ్రామ్ వినియోగదారుడు షేర్ చేశాడు.. డుకాటి ఇండియా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఈ వీడియోకు స్పందించింది. ఎమోజీతో కామెంట్స్ చేసింది. అయితే ఇది కామెడీ కోసం చేసిన వీడియోలా కనిపిస్తోంది. ఇది తన బైక్ కాదని, ఒకట్రెండు సంవత్సరాల్లో డుకాటి మాన్‌స్టర్ బైక్ కొంటానని సదరు క్రియేటర్ కామెంట్ చేశాడు. ఇలా ఫన్నీ వీడియోలతో జొమాటో వార్తల్లోకి రావడం కొత్తేమి కాదు.. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది…