ప్రపంచంలో ప్రతిభకు కొదవ లేదు. కొంతమంది పెద్దయ్యాక వారి ప్రతిభను ప్రదర్శిస్తే, మరికొందరు చిన్న తనం నుంచే వారి ప్రతిభను కొనసాగిస్తుంటారు. అంతర్లీనంగా దాగున్న ప్రతిభను ప్రదర్శించడంలో చిన్నారులు ఎప్పుడూ ముందు ఉంటారు. చిన్నతనం నుంచి వారిలో దాగున్న ప్రతిభను ప్రొత్సహిస్తే తప్పకుండా చిన్నారులు ఉన్నత స్థితికి ఎదుగుతారు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. రష్యాకు చెందిన 12 ఏళ్ల ఇవింక సావకస్ అనే చిన్నారికి చిన్నతనం నుంచి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. తండ్రి కూడా బాక్సర్ కావడంతో చిన్నతనం నుంచి శిక్షణ తీసుకుంది.
Read: క్రిప్టో కరెన్సీపై ఉచిత కోర్స్… ఎక్కడో తెలుసా…!!
నాలుగేళ్ల వయసునుంచే ఇవింక బాక్సింగ్‌లో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. అత్యంత కఠినమైన శిక్షణను తీసుకుంది ఇవింక. ఒక్కనిమిషంలోనే 100 పంచ్‌లు విసరడంలో నైపుణ్యాన్ని సాధించింది. చెట్లను, ఐరన్‌తో చేసిన తలుపులను తన పంచ్‌లతో సునాయాసంగా పడగొడుతూ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. దీంత 12 ఏళ్ల ఇవింకను ప్రపంచంలోనే అత్యంత బలమైన బాలికగా గుర్తించారు. ఇవింక ఫీట్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.