NTV Telugu Site icon

వైర‌ల్‌: 30 ఏళ్లుగా ఆ టిఫెన్ షాపులో అవే ధ‌ర‌లు…

దేశంలో క‌రోనా కార‌ణంగా ల‌క్ష‌లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉపాధికోసం చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. వ‌చ్చిన సంపాద‌న‌తో కాలం వెల్ల‌దీస్తున్నారు. త‌క్క‌వ పెట్టుబ‌డితో చేసే వ్యాపారాల్లో టిఫెన్ షాపు కూడా ఒక‌టి. రుచిని బ‌ట్టి, ధ‌ర‌ల‌ను బ‌ట్టి వ్యాపారం సాగుతుంది. కొంత‌మంది త‌క్కువ ధ‌ర‌కు మంచి రుచిగా ఉండే టిఫెన్ అందిస్తుంటారు. క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరుకు చెందిన ఓ మ‌హిళ గ‌త 30 ఏళ్లుగా చిన్న టిఫెన్ షాపును నిర్వ‌హిస్తోంది. 30 ఏళ్ల‌క్రితం ఏ ధ‌ర‌ల‌కు టిఫెన్‌ను అందిస్తున్నారో, అదే ధ‌ర‌కు ఇప్పుడు కూడా రుచిక‌ర‌మైన టిఫెన్‌ను అందిస్తున్న‌ది ఆ మ‌హిళ‌. ఇడ్లీ ప్లేటు రూ.2.50 కి, దోశ రూ. 5 కి అందిస్తున్నారు. త‌క్కువ ధ‌ర‌కు ఎక్కువ మందికి రుచిక‌ర‌మైన టిఫెన్‌ను అందించాల‌నే ల‌క్ష్యంతో ఆ షాపును ర‌న్ చేస్తున్న‌ట్టు స‌ద‌రు మ‌హిళ పేర్కొన్న‌ది. దీనికి సంబంధించిన న్యూస్‌, ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Read: ఆ గ్రామంలో పాలు, పెరుగు ఫ్రీ… ఎందుకంటే…