ఒకప్పుడు మనం డబ్బులు దాచుకోవాలంటే.. గళ్ల గురిగిలోనే.. పోపుల డబ్బాలోనే.. బీరువాలోనో దాచుకుంటాం. ప్రస్తుతం అన్ని బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్స్ లో పొదుపు చేసుకుంటున్నాం. ఇంత వరకు బాగానే ఉన్న .. ఓ మహిళ తాను ఎన్నో నెలల నుంచి సంపాదించిన డబ్బు గళ్ల గురిగిలో దాచుకుంది. గురిగి బరువెక్కిందని సంతోషంతో ఆ గళ్ల గురుగుని పగుల గొట్టింది. గురిగి పగులగొట్టి చూడగానే ఆమె షాక్ కు గురయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Dangal Fame : ఘనంగా దంగల్ నటి జైరా వసీం వివాహం..
తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీలో కూసింత డబ్బును కిడ్డీ బ్యాంక్ లేదా హుండీ(పింగాణీ గల్లాపెట్టె)లో లాంటి వాటిల్లో దాచుకునేవారు. ఒకసారి అవి ఫుల్‌గా నిండిన తర్వాత వాటిని పగలగొట్టి.. అత్యవసర సమయాల్లో ఆ డబ్బును ఉపయోగించుకునేవారు. ఓ మహిళ పింగాణీ హుండీలో తన డబ్బును దాచుకుంది. హుండీ బరువుగా ఉందని.. ఎంత డబ్బు పోగయ్యిందేమోనని దానిని ఆశగా పగల గొట్టి చూసి షాక్ అయ్యింది. హుండీలో మొత్తం చదలు పట్టి నగదు మొత్తం చెద పురుగులు పట్టి తినేసాయి. దీంతో ఆమె ఆశలన్ని ఆవిరయిపోయాయి.. రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్లుగా.. పాపం ఆమె సొమ్మంతా చెదలపాలయ్యింది.
Read Also: Railways: కదులుతున్న రైలు డోర్ దగ్గర కొబ్బరి కాయ కొట్టిన ఉద్యోగి.. చర్యలు తీసుకోవాలన్న ప్రయాణీకులు
హుండీలో దాచిపెట్టిన సొమ్ముతో ఏదైనా కొనుక్కుందాం అని అనుకున్న ఆమె ఆశలు ఆవిరయ్యాయి. హుండీలో ఉన్న డబ్బంతా చెద పురుగుల పాలైంది. చెద పురుగులతో హుండీలోని కరెన్సీ నోట్లన్ని కూడా సగం చిరిగి కనిపించాయి. ఆ దృశ్యంతో మహిళ గుండె బద్దలయినంత పనైంది. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్ లు మాత్రం ఎంత పనైపోయిందంటూ .. సానుభూతి చెబుతున్నారు.