Site icon NTV Telugu

Viral Video: సేఫ్టీ కోసం సీసీకెమెరాలు పెడితే.. తీరా భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు!

Viralvideo

Viralvideo

ఒక వ్యక్తి రక్షణ కోసం తన ఇంట్లో.. బయట సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. ఎవరైనా దొంగలు పడినా.. లేదంటే అజ్ఞాత వ్యక్తులు వచ్చినా కనిపెట్టడం కోసం ఏర్పాటు చేసుకున్నాడు. సీసీ కెమెరాలు పెట్టింది ఒక ఉద్దేశంతో పెడితే.. అందులో రికార్డైన దృశ్యాలు చూసి అవాక్కయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Babar Azam: బాబర్‌ను తప్పించలేదు.. రెస్ట్ ఇచ్చాం: అజార్

భర్త పని మీద బయటికి వెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి ఇంటికి  వచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లోని సీసీ ఫుటేజీని పరిశీలించాడు. చివరకు అందులోని దృశ్యాలు చూసి ఖంగుతిన్నాడు. ఇంట్లోకి చాలా మంది మగవాళ్లు వస్తూ, పోతూ ఉండడం చూసి షాక్ అయ్యాడు. అందరినీ తన భార్యే ఇంట్లోకి ఆహ్వానించడం చూసి మరింత ఆశ్చర్యపోయాడు. లోపలికి వచ్చిన వారినందరిని హగ్ చేసుకుని లోపలికి తీసుకెళ్లేది. చాలా సేపటి తర్వాత బయటికి పంపడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. రక్షణ కోసం అతగాడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే.. తీరా అర్ధాంగి చేసిన నిర్వాకం చూసి నిశ్చేష్టుడయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Exit mobile version