Honeymoon: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన క్షణం. ఇంట్లో ఉత్సాహం, కొత్త కలలు, ఆత్మీయుల సందడి, రుచికరమైన విందు – ఇవన్నీ ఆ వేడుకను మరింత అందంగా మార్చుతాయి. సాధారణంగా పెళ్లికి వచ్చే అతిథులకు గౌరవం ఇవ్వడం, వారికి రుచికరమైన భోజనం వడ్డించడం ఆనవాయితీగా ఉంటుంది. అయితే ఇటీవల ఓ పెళ్లిలో జరిగిన వింత సంఘటన సోషల్ మీడియాలో సంచలనం రేపింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సంఘటనలో, పెళ్లి విందును అతిథుల ముందే వేలం వేసారు. సమాచారం ప్రకారం, వధూవరులు అతిథులను కూర్చోబెట్టి, “మొదటి ప్లేట్ భోజనాన్ని వేలానికి పెడుతున్నాం. దానిని ఎవరు కొనుగోలు చేస్తారో వారికి ముందుగా వడ్డిస్తాం. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బుతో మేము అలాస్కాకు హనీమూన్ వెళ్తాం,” అని ప్రకటించారు. ఆశ్చర్యకరంగా, ఒక అతిథి రూ.1,29,285 చెల్లించి ఆ తొలి ప్లేట్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత మిగతా అతిథులకు సాధారణంగా భోజనం వడ్డించారు.
Tamil Nadu: భార్యపై దాడి చేసి, ఆస్పత్రిలో ఉన్నా కనికరం లేకుండా దారుణహత్య..
ఈ విషయం @turbothad అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేయబడటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అనేక మంది నెటిజన్లు ఈ చర్యను అవమానకరంగా, అసభ్యకరంగా అభివర్ణిస్తున్నారు. “మీ పెళ్లిలో ఒక ప్లేట్ భోజనం కోసం డబ్బు వసూలు చేయడం సిగ్గుచేటు. మీ స్నేహితులు, బంధువులు ఇప్పటికే డబ్బు, సమయం వెచ్చించి మీ పెళ్లికి వస్తున్నారు,” అని పలువురు విమర్శిస్తున్నారు.
మరికొందరు “ఇలాంటి పెళ్లిలో ఒక్క నిమిషం కూడా ఉండం,” అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పెళ్లిళ్లు డబ్బు సంపాదన కోసం వ్యాపారాలుగా మారిపోతున్నాయని తీవ్రంగా మండిపడుతున్నారు.
Shashi Tharoor: నాకు పార్టీ కన్నా దేశం ముఖ్యం.. కాంగ్రెస్‌కు థరూర్ షాక్..
