Site icon NTV Telugu

Viral video: అభిమానికి లులూ ఛైర్మన్‌ సెల్ఫీ.. నెటిజన్లు ప్రశంసలు

Viralvideo

Viralvideo

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటూరు పెద్దలు. దీనికి నిలువెత్తు నిదర్శనం లులూ గ్రాప్ సంస్థల ఛైర్మన్ యూసఫ్ అలీనే.
ఇతడు భారత బిలియనీర్. జాతీయ, అంతర్జాతీయంగా 256 హైపర్ మార్కెట్‌లు, మాల్స్‌ ఉన్నాయి. ఫోర్బ్స్ జాబితా ప్రకారం అతని ఆస్తుల నికర విలువ $8.9 బిలియన్లకు పైగా ఉన్నాయి. అయినా కూడా ఎక్కడా గర్వం కనిపించదు. ఒక సామాన్య వ్యక్తిలా అందరితో కలిసిపోతారు. ఇందుకు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోనే ఉదాహరణ.

ఇది కూడా చదవండి: Sanjay Singh: “ఉద్యమం కాంగ్రెస్ స్క్రిప్ట్.. దేశద్రోహం కేసు నమోదు చేయాలి”..వినేష్-బజరంగ్ పై రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు ఫైర్

యూసఫ్ అలీ ఇటీవల అబుదాబీలో పర్యటించారు. లులూ గ్రూప్‌కి చెందిన అతి పెద్ద షాపింగ్ మాల్‌ను విజిట్ చేశాడు. అక్కడ యూఏఈకి చెందిన చంద్రశేఖరన్ పుతురుతి అనే యువతి.. యూసఫ్ అలీని చూడగానే సెల్ఫీ తీసుకోవాలని ముచ్చట పడింది. దీన్ని గమనించిన లులూ ఛైర్మన్.. వెంటనే ఆ యువతి దగ్గరకు వెళ్లి సెల్ఫీ దిగారు. నవ్వుతూ ఉల్లాసంగా కనిపించారు. ఈ వీడియోను ఆ యువతి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘జీవితంలో ఎంత గొప్ప స్థానానికి వెళ్లినా ఇతరులతో వినయపూర్వకంగా వ్యవహరించే గొప్ప వ్యక్తిని కలుసుకున్నాను. భారత బిలియనీర్‌ యూసఫ్‌అలీని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అంటూ ఆమె వ్యాఖ్యానించింది. నవ్వుతూ.. సరదాగా యూసఫ్ అలీ ఫొటోలకు పోజులిచ్చిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి.

ఇది కూడా చదవండి: Sanjay Singh: “ఉద్యమం కాంగ్రెస్ స్క్రిప్ట్.. దేశద్రోహం కేసు నమోదు చేయాలి”..వినేష్-బజరంగ్ పై రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు ఫైర్

వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆయన గొప్ప మనసును, మంచితనాన్ని అభినందిస్తున్నారు. ఓ నెటిజన్‌ స్పందిస్తూ ‘‘ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. ఆయనకు నేను వీరాభిమానిని’’ అంటూ రాసుకొచ్చారు. ‘‘నా జీవితంలో అత్యంత ప్రియమైన వ్యక్తి’’ అని మరొకరు రాశారు. ‘‘దీన్నే వినయం అంటారు. గ్రేట్’’ అంటూ ఇంకొకరు రాశారు. ఇటీవల తన అభిమాని, యూట్యూబర్ ఎఫిన్‌కు రూ.2లక్షల ఖరీదైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చి అతడిని ఆశ్చర్యపరిచారు. ఈ వీడియో కూడ తెగ వైరల్ అయింది.

Exit mobile version