ప్రస్తుత కాలంలో కొందరు యువకులు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటారు. కొందరు ఏదో రకంగా వార్తల్లో నిలవాలని తాపత్రయపడుతుంటారు. అందుకోసం పిచ్చి పనులు, సాహసాలు చేసేందుకు కూడా వెనుకాడరు. ఎదుటివాళ్లను ఆకర్షించేలా ఏదో చేద్దామనుకుంటారు. కానీ ఓ యువకుడు చేసిన పిచ్చి పనికి ఫలితం అనుభవించాడు. దీంతో అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.
వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు తనకు రోడ్డు మీద గుంత కనిపించింది కదా అని ప్యాంట్ జిప్ తీసి పిస్ కొట్టడం ప్రారంభించాడు. రోడ్డు మీద వాహనాలు వెళ్తున్నా అతడు లెక్కచేయకుండా పిస్ కొడుతూనే ఉన్నాడు. కానీ ఇంతలో ఓ లారీ వేగంగా దూసుకొచ్చింది. ఆ లారీ చక్రాలు గుంతలో పడటంతో అందులో ఆ యువకుడు పోసిన యూరిన్ అతడి ముఖంపైనే చిందాయి. ఈ వ్యవహారం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. దీంతో ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్‌లు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కర్మ అంటే ఇదే అని కొందరు.. తప్పతాగి యువకుడు రోడ్డు మీద ఇలా యూరిన్ పోస్తున్నాడని మరికొందరు కామెంట్లు చేశారు. మొత్తానికి యువకుడికి తగిన శాస్తే జరిగిందని మెజారిటీ నెటిజన్‌లు కామెంట్ చేయడం గమనార్హం.
For peeing on road pic.twitter.com/CokMZvhxRP
— Instant Karma (@Instantregretes) June 24, 2022