మానవాళికి జంతువులకు వీడిదీయలేని అనుంబంధం ఉంది. సింహం లాంటి మాంసాహార జంతువులు సైతం మనుషుల మధ్య పెరుగుతూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్న వీడియోలు మనం చూస్తునే ఉంటాం. అయితే కొన్ని కొన్ని సార్లు జంతువులలో ఉన్న మేథాశక్తి బయటపడుతుంటుంది. వాటి మేథాశక్తి ముందు కొన్ని సార్లు మనుషులు మెదడు తక్కువే అనిపిస్తుంటుంది. అయితే ఇదంతా ఇప్పుడెందుకు అంటే.. ఓ ఎలుగుబంటి చేసిన పని అలాంటిది మరీ.. ఓ ఎలుగుబంటి పడిపోయిన ట్రాఫిక్ కోన్ కనిపించగానే సరిచేసి వెళ్లిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను ‘బిటింగెబిడెన్’ అనే యూజర్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఓ ఎలుగుబంటి దారెంట నడుచుకుంటూ వెళ్తున్నది. పక్కన ట్రాఫిక్ కోన్ పడిపోయి కనిపించగానే, అక్కడే ఆగిపోయి, దాని దగ్గరికెళ్లి నోటితో దాన్ని సరిచేసింది. ఈ వీడియోను అమెరికాలోని అలస్కాలోగల డెనాలి నేషనల్ పార్క్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
https://twitter.com/buitengebieden/status/1535510653519151107?s=20&t=IWMPD2CT98_hdU7ymgRr6g
