Site icon NTV Telugu

Vadapav Girl: మొన్న కుమారి ఆంటీ.. నేడు వడాపావ్ అమ్మాయి.. ఏంటి దారుణం

Kumari

Kumari

Vadapav Girl: అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దలు చెప్తారు. అంటే ఏది అతిగా ఉండకూడదు అని అర్ధం. దానివల్లన ఎంత పేరు వస్తుందో.. అంతే వివాదాలు కూడా వస్తాయి. ఈ మధ్యకాలంలో కుమారి ఆంటీ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్‌ ఎదురుగా ఆమె తన స్ట్రీట్‌ఫుడ్‌ బిజినెస్‌ను స్టార్ట్ చేసి 13 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఎక్కువ కావడంతో ఆమె ఫేమస్ అయ్యింది. ఆ స్ట్రీట్ ఫుడ్ బాగా నచ్చిందని యూట్యూబర్లు చెప్పడంతో ప్రజలు అక్కడకు పరుగులు పెట్టారు. ఆ తరువాత అదే ఆమెకు చిక్కులు తీసుకొచ్చి పెట్టింది. ఆమె ఫుడ్ కోసం ప్రజలు ఎగబడడంతో ట్రాఫిక్ జామ్ అవ్వడం, దీంతో ఆమె స్టాల్ ను పోలీసులు మూయించడం జరిగింది. ఇక ఇదే సీన్.. ఢిల్లీలో రీపీట్ అయ్యింది. ఢిల్లీ రోడ్లలో వడాపావ్ గర్ల్‌‌గా పేరు తెచ్చుకున్న చంద్రికా గేరా దీక్షిత్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది.

ఢిల్లీ అంటే వడాపావ్ కు ఫేమస్. ఒక్క వీధిలో 10కి పైగా స్ట్రీట్ స్టాల్స్ ఉంటాయి. ఇక వారందరిని దాటుకొని చంద్రికా వడాపావ్ కు ఫేమస్ అయ్యింది. ఆమె బండివద్ద ఎంతోమంది వడాపావ్ తిని టేస్ట్ బావుందని వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. ఇక దీంతో ఇక్కడ కుమారి ఆంటీ షాపు మీద ఎగబడ్డట్టే అక్కడ కూడా వడాపావ్ కోసం ఎగపడడం మొదలుపెట్టారు. చంద్రికా ఫుడ్‌స్టాల్ దగ్గర వడాపావ్ తినాలంటే గంటల సేపు వెయిట్ చేయాలి. ఎందుకంటే జనాలు పెద్ద సంఖ్యలో క్యూ కడతారు.అలా అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో కొంతమంది మహిళలు ఆమెపై విరుచుకుపడ్డారు. రోడ్డుమీద ట్రాఫిక్ ఇలా ఉంటే జనాలు ఇంటికి ఎలా వెళ్లారు అంటూ ఆమెపై ఫైర్ అయ్యారు. ఇక ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి.. ఢిల్లో మున్సిపల్ కార్పిరేషన్ అధికారులు ఫుడ్‌స్టాల్ మూసి వేయాలని ఆమెపై ఒత్తడి తీసుకొచ్చారు. గతంలో పర్మిషన్ కోసం రూ.30 వేలు చెల్లించాలని, అధికారులు ఇంకా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఇప్పుడు ఆమెను వెంటనే స్టాల్ మూయించాలని అధికారులు చూస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వలన మరో యువతీ.. తన జీవనాధారాన్ని కోల్పోనుంది. ఆమె ఫేమస్ అవ్వకపోయి ఉంటే.. భర్తతో కలిసి వడాపావ్ ను అమ్ముకుంటూ ఉండేది. కానీ, ఇప్పుడు డబ్బు కట్టి.. ఆ స్టాల్ ను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంత దారుణం ఎక్కడా ఉండదు అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి కుమారి ఆంటీలా ఈ వడాపావ్ గర్ల్.. మళ్లీ తన స్టాల్ ను నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.

Exit mobile version