Viral News: ఇప్పటి కాలంలో పిల్లలు ఎంతగా ఎదిగారంటే వారి గురించి తెలుసుకోవడం ఏమో గానీ.. వారికున్న జ్క్షానాన్ని మనం అసలు ఊహించుకోలేం.. వారు మాట్లాడే మాటలు, భాష వాడే తీరు ఒక్కొక్కసారి మనల్నే ఆశ్చర్య పరిచేలా వుంటుంది. అయితే ఓ స్కూల్ లో ఇటీవల వ్యాస రచనల పోటీ పెట్టారు యాజమాన్యం. ఆ జవాబుకు 10 మార్కులు. అందులో ఒక ప్రశ్నకు ఆస్టూడెంట్ రాసిన సమాధానం చదివి టీచర్లకు మైండ్ బ్లాక్ అయ్యింది.
ఆస్టూడెంట్ రాసిన సమాధానానికి నవ్వాలో.. లేక తిట్టాలో వారికే అర్థం కాలేదు. ఆ ప్రశ్న ఏమిటంటే.. ‘పెళ్లి’ గురించి వివరించమని అడిగారు. ఆ విద్యార్థి సోషల్ స్టడీస్ పరీక్ష పేపర్‌లో వివాహం యొక్క భావనను వివరించాడు అతని సమాధానం విడ్గూరంగా ఉంది. మరి పదికి పది మార్కులు సంపాదించాడనే అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే.. పదికి సున్నామార్కులు సంపాదించాడు ఆస్టూడెంట్.. అయితే ఆ ఆన్సర్ ఏంటని తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. ఆ విద్యార్థి రాసిన సమాధాన పత్రానికి సంబంధించిన ఫోటో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.
Read also: Smart Meters: ఏపీలో గృహ విద్యుత్ వినియోగానికి స్మార్ట్ మీటర్లు
నువ్వు పెద్దదానివయ్యావు.. నీవు మారాం చేస్తే నిన్ను ఎత్తుకుని, బుజ్జగించి తినిపించలేము.. నీవు ఇప్పుడు పెద్దదానివయ్యావు కాబట్టి అంతా తెలుసుకుని ముందుకు సాగాలి.. వివాహం చేసుకోవాల్సిన వయస్సు నీకు వచ్చింది. వేరొక వ్యక్తితో జీవితం పంచుకునే వయస్సు నీకు వచ్చింది. అతనితో జీవితాన్ని పంచుకుని సంతోషంగా పిల్లల్నికని కలిసి జీవించండంటూ రాశాడు ఆ విద్యార్థి. ఇది చూసి, చదివిన టీచర్ కు మైండ్ బ్లాక్ అయ్యింది. దాన్ని రైట్ చేయాలో.. రాంగ్ చేయాలో కాసేపు ఆ జవాబును చూస్తూ వుండిపోయాడు. కాసేపు తర్జన భర్జన పడ్డ టీచర్ దాన్ని రాంగ్ అంటూ ఇంటూ వేసి తనకు పదికి సున్నా మార్కులు వేశారు. టీచర్ దానిని ‘నాన్సెన్స్’ అని కూడా పిలిచారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ స్టూడెంట్ ఆన్సర్, టీచర్ మళ్లీ దానికిచ్చిన జవాబు మాత్రం వైరల్ గా మారాయి. ఇప్పుడు ఆవిద్యార్థి సమాధానం రాసిన పేపర్ వైరల్ గా మారింది. ఒక్కసారి ఆ ఆన్సర్ మీరు చదివి ఆస్టూడెంట్ కు మీరు ఎన్ని మార్కులు ఇస్తారో చూడండి మరి.
Flying Cars: ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయ్.. దుబాయ్‌లో పరీక్ష విజయవంతం
