Site icon NTV Telugu

Eating Banana: షాకింగ్ న్యూస్.. ఈ అరటిపండ్లు తింటే మనుషులు చనిపోతారా?

Banana

Banana

Eating Banana: పండ్లలో అరటిపండు ఎంతో చౌకగా లభిస్తుంది. అరటిపండు జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. కానీ ప్రస్తుతం అరటిపండ్ల గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అరటిపండ్లు తింటే చనిపోతారనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. సోమాలియా నుంచి ఇటీవల భారత్‌కు పెద్ద ఎత్తున అరటిపండ్లు దిగుమతి అయ్యాయని.. వీటిని తింటే 12 గంటల్లో చనిపోతారని ప్రచారం జరగుతుండటం పలువురిని షాక్‌కు గురిచేస్తోంది. సోమాలియా నుంచి దిగుమతి అయిన అరటి పండ్లలో భయంకరమైన హెలికోబ్యాక్టర్ అనే బ్యాక్టీరియా ఉందని.. అది చూడటానికి వానపాములా ఉంటుందని.. ఈ బ్యాక్టీరియా ఉన్న అరటి పండ్లను తిన్న వెంటనే వాంతులు, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతూ తిన్న 12 గంటల్లోపు బ్రెయిన్ డెడ్ అయి మనిషి చనిపోతాడంటూ వదంతులు చెలరేగాయి.

Read Also:Self-Employment: సెల్ఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ని క్రియేట్‌ చేసే మ్యాజిక్కే ‘డిజిటల్ మార్కెటింగ్’.

అయితే ఈ వార్త గురించి తమిళనాడులోని నేషనల్ బనానా రీసెర్చ్ సెంటర్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాడైన అరటి పండ్లలో హెలికోబ్యాక్టర్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదని తెలిపింది. అలాగే వీడియోలో చూపినట్టుగా బ్యాక్టీరియా పరిమాణం వానపాములా అంత పెద్దగా ఉండదని వెల్లడించింది. బ్యాక్టీరియాలను కేవలం మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలమని స్పష్టం చేసింది. మరో ముఖ్య విషయం ఏంటంటే.. సోమాలియా నుంచి భారత్ అరటి పండ్లను దిగుమతి చేసుకుంటున్నట్లు ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేసింది. ఇదంతా అసత్య ప్రచారం అని.. ఇలాంటి వాటిని నమ్మవద్దని షనల్ బనానా రీసెర్చ్ సెంటర్ సైంటిస్టులు సూచించారు. హెలికోబ్యాక్టర్ అనే బ్యాక్టీరియా స్టమక్ (పొట్ట) క్యాన్సర్‌కు కారణం అవుతుందని.. గంటల్లో ఆ బ్యాక్టీరియా మనిషిని చంపలేదని తెలిపారు.

Exit mobile version