Site icon NTV Telugu

Viral Video: స్టేజీపై ‘పుష్ప 2’ పాటకు స్టెప్పులేసిన మాజీ సీఎం.. రచ్చ రచ్చే (వీడియో)

Aravind

Aravind

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంట పెళ్లి సందడి నెలకొంది. కేజ్రీవాల్ కుమార్తె హర్షిత వివాహం ఘనంగా నిర్వహించారు. కూతురు ఇష్టపడిన ప్రియుడు సంభవ్‌ జైన్‌తో శుక్రవారం రాత్రి వివాహం అంగరంగా వైభవంగా జరిగింది. ఈ వేడుక ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో నిర్వహించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా, చాలా మంది ప్రముఖులు, ఆప్ నేతలు హాజయ్యారు.

READ MORE: Elon Musk: మోడీతో మాట్లాడటం గొప్ప గౌరవం.. ఈ ఏడాది భారత్‌కి వస్తా..

చాలా రోజుల తర్వాత కేజ్రీవాల్ ఫుల్ జోష్‌గా కనిపించారు. ఈ వేడుకల్లో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ తన భార్య సునీతతో కలిసి స్టెప్పులేశారు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప-2’ చిత్రంలోని ‘సూసేకీ’ పాట హిందీ వెర్షన్‌కు డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నారు. కేజ్రీవాల్ స్టెప్పులు చూసిన బంధుమిత్రులు బాగా ఎంజాయ్ చేశారు. కేకలు వేస్తూ.. ఉత్సాహం పెంచారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతే కాకుండా ఈ వేడుకకు హాజరైన పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సైతం అద్భుతంగా డ్యాన్స్ చేశారు.

READ MORE: Trisha : అలాంటి పరిస్థితి నాకు రాకూడదు.. అందుకే పెళ్ళి వద్దు

Exit mobile version