Site icon NTV Telugu

Delhi metro: ఢిల్లీ మెట్రోలో ఫైటింగ్.. కొట్టుకున్న యువకులు

Delhimetro

Delhimetro

ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లోకి నిలిచింది. నిత్యం ఏదొక వార్తల్లో ఉంటూనే ఉంటుంది. డ్యాన్స్ రీల్స్, వికారమైన డ్రెస్సింగ్.. అనేకమైన వీడియోలు ఆన్‌లైన్‌లో దర్శనమిస్తుంటాయి. తాజాగా ఇద్దరు యువకులు ఘర్షణకు దిగారు. ఇంతలో ఒకరు చెప్పు తీసుకుని కొడితే.. ఇంకొకరు చెంపదెబ్బ కొట్టారు. దీంతో ఇద్దరి మధ్య వార్ నడిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: Swapnil-MS Dhoni: ధోనీ నాకు ఆదర్శం.. స్టార్ షూటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఢిల్లీ మెట్రోలో ఇద్దరు ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరిగింది. కొన్ని సెకన్ల తర్వాత ఒక వ్యక్తి తన చెప్పుతో మరొకరి ముఖంపై కొట్టాడు. అవతలి వ్యక్తి ప్రతిస్పందించి రెండుసార్లు తిరిగి కొట్టాడు. ఇంకొకరు జోక్యం చేసుకుని కొట్లాటను ఆపాడు. అయితే ఈ ఘర్షణ ఎందుకు జరిగిందో తెలియదు గానీ.. ఈ వీడియో మాత్రం వైరల్‌గా మారింది. దాదాపు 2 మిలియన్లు వీక్షించారు.

ఇది కూడా చదవండి: Terror Attack: ఉగ్రవాదులను అంతమొందించే సరికొత్త టెక్నాలజీ..!

Exit mobile version