NTV Telugu Site icon

Video Games: వీడియో గేమ్స్‌తో పిల్లలకు ప్రాణాపాయం.. గుండె సమస్యలు తప్పవు..!!

Video Games

Video Games

Video Games: ఈరోజుల్లో ప్రతి ఇంట్లో చిన్నారులు వీడియో గేమ్స్‌తో మాత్రమే కాలక్షేపం చేస్తున్నారు. చిన్నారులకు స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్ ఉంటే చాలు. తిండి తినడం కూడా మానేస్తున్నారు. వీడియో గేమ్స్‌కు అంతగా వాళ్లు ఎడిక్ట్ అయిపోయారు. అయితే ఈ వ్యాపకం పిల్లలకు ప్రాణాపాయంగా పరిణమించే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియాలోని హార్ట్ సెంటర్ ఫర్ చిల్డ్రన్ పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ మేరకు అధ్యయనం చేసిన నివేదికను సైంటిస్టులు హార్డ్ రిథమ్ అనే జర్నల్‌లో ప్రచురించారు. సాధారణంగా కొందరు పిల్లల స్పందన క్రమబద్ధంగా ఉండదని.. తల్లిదండ్రులు ఈ విషయాన్ని ముందుగా గుర్తించరని.. అలాంటి చిన్నారులు వీడియో గేమ్స్ ఆడినప్పుడు వారి హృదయంపై తీవ్ర ఒత్తిడి నెలకొని ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని సైంటిస్టులు తమ నివేదికలో అభిప్రాయపడ్డారు.

Read Also: Elnaaz Norouzi: హిజాబ్‌ ఉద్యమానికి మద్దతుగా బట్టలన్నీ విప్పేసిన నటి

కొంతమంది చిన్నారులు వీడియో గేమ్స్ చూస్తూ స్పృహ కోల్పోవడం వీరిలో సమస్యకు మొదటి సూచన అని పరిశోధకులు హెచ్చరించారు. మల్టీప్లేయర్ యుద్ధాల తరహా వీడియో గేమ్స్‌లో అధిక శాతం మంది స్పృహ కోల్పోయినట్లు గుర్తించామని వారు తెలిపారు. అయితే కొందరు చిన్నారులకు ఏకంగా గుండె ఆగిపోయిందని పరిశోధనలో వెల్లడైంది. అయితే చిన్నారులు స్పృహ కోల్పోతే వారిని వెంటనే హృద్రోగ నిపుణులకు చూపించాలని సైంటిస్టులు సూచించారు. కాటెకొలామినెర్జిక్ పాలీమార్ఫిక్ వెంట్రిక్యులర్ టాకీకార్డియా (సీపీవీటీ), కాంటెనిటల్ లాంగ్ క్యూటీ సిండ్రోమ్ (ఎల్‌క్యూటీఎస్) అనే సమస్య చిన్నారుల్లో ఈ అనారోగ్యం తలెత్తేందుకు కారణమవుతుందని.. ఎలక్ట్రానిక్ గేమింగ్ విధానంలో పిల్లల కుటుంబాలు, ఆరోగ్య సంస్థలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు తెలిపారు.

Show comments