ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఎంతో మంది ఎంతో ఉన్నతమైన పదవుల్లో ఉన్నా.. చిన్నప్పటి స్కూల్ జ్ఞాపకాలు మరవలేనివి. దేవుడు ఒక ఛాన్స్ ఇస్తే మళ్లీ చిన్ననాటి స్కూల్ డేస్ లోకి వెళ్లాలని చాలమందే అనుకుంటారు. స్కూల్ గురించి ఎవరైనా మాట్లాడిన మనం అనుకోకుండా మన స్కూల్ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతుంటాం. ఆనాడు చేసిన అల్లరిని గుర్తు చేసుకుంటుంటాం. పాఠశాల విద్యాభ్యాసం, 10 తరగతి పరీక్షల తరువాత అప్పటివరకు కలిసి చదువుకున్న స్నేహితులు ఇకనుంచి మనతో చదువుకోకుండా ఒక్కోరు ఒక్కో దిక్కు వెళ్లిపోయారనే భావన కళ్లను చమర్చుతాయి.
అయితే చిన్నప్పుడు స్కూల్ వెళ్లకుండా ఉండేందుకు ఎన్నో సాకులు చెప్పిన సంఘటనలు ప్రతి ఒక్కరికీ ఉండే ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సార్లు స్కూల్ తప్పించుకోవడానికి చెప్పిన మాటల ఎంతో ఇప్పుడు గుర్తు చేసుకుంటే నవ్వును కూడా తెప్పిస్తుంటాయి. అలాంటి ఘటనే ఇదే.. ఓ స్కూల్ వెళ్లిన బాబు స్కూల్ నుంచి ఇంటికి పోవడానికి చెప్పిన సాకులు అందరిలో నవ్వులు పూయిస్తోంది. మీరు కూడా ఆ వీడియోను చూసి నవ్వేయండి.
