NTV Telugu Site icon

Fake Kidnapping Reel: ‘నకిలీ కిడ్నాప్’ రీల్ వైరల్.. నలుగురు యువకులపై కేసు

Reels

Reels

ప్రస్తుతం నెటిజన్లు రీల్స్ వ్యసనంగా మారారు. దీంతో రీల్స్ క్రియేట్ చేసే వాళ్లు కంటెంట్ కోసం చిత్ర విచిత్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రీసెంట్ గా వైరల్ అవుతున్న ఈ వీడియోలో యువకులు డిఫరెంట్ గా ఆలోచించి రీల్ రూపొందించారు. నలుగురు అబ్బాయిలు ‘నకిలీ కిడ్నాప్’ చేయడానికి ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ చేరుకున్నారు. ‘ఫేక్ కిడ్నాప్’ వీడియోలు చేసి ఫేమస్ కావడమే వీరి లక్ష్యం. ఈ రీల్‌ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ నకిలీ కిడ్నాప్ రీల్ చేసిన యువకులను నిజమైన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే..

READ MORE: Israel: ఆరుగురు అల్ జజీరా జర్నలిస్టులు టెర్రరిస్టులు.. ఇజ్రాయిల్ ఆరోపణలు..

వీడియోలో ఏముందంటే..
ఈ వీడియోలో.. ఓ యువకుడు చాట్ షాప్ వద్ద నిలబడి చాట్ తింటున్నాడు. ఇంతలో ఇద్దరు అబ్బాయిలు స్ప్లెండర్ బైక్‌పై వచ్చి ఏదో వాసన చూయించి ఆ యువకుడిని బైక్ మధ్యలో కూర్చోబెట్టి తీసుకెళ్తారు. ఈ క్రమంలో బైక్ నడుపుతున్న వ్యక్తి చెప్పులు ఊడిపోవడంతో కిక్ రాడ్డును కొట్టలేక పోతాడు. బైక్ స్టార్ట్ కాకపోవడంతో వెంటనే బహిరంగంగా జరుగుతున్న కిడ్నాప్‌ను చూసి ప్రజలు అడ్డుకునేందుకు ముందుకు వస్తారు. బైక్ పైన వచ్చిన యువకులను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా… ఆ యువకులు కెమెరామెన్ వైపు చూపిస్తూ ఇదంతా వీడియో తీస్తున్నట్లు, ఇది ఫ్రాంక్ అని చెబుతారు. ఆ తర్వాత ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

READ MORE:Pushpa 3 : పుష్ప 3 కూడా.. నిర్మాత సంచలనం

ఈ రీల్‌కి సంబంధించి ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. కెమెరామ్యాన్‌తో సహా ఈ నలుగురు అబ్బాయిలను పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. ఈ వీడియోను ఎక్స్‌లో పంచుకున్న @SachinGuptaUP ఖాతాదారు.. ఈ వీడియో చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీడియోను పోస్ట్ చేస్తూ.. “యూపీలోని ముజఫర్‌నగర్‌లో నలుగురు అబ్బాయిలు కిడ్నాప్‌ రీల్‌ను షూట్ చేశారు. ఈ నలుగురు రీల్‌పుత్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేర్లు గుల్షేర్, మోనిష్, సాదిక్, సమద్.” అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు.