Site icon NTV Telugu

Zelensky: క‌మెడియ‌న్‌గా కెరీర్‌… సూప‌ర్ డ్యాన్స‌ర్‌గా ప్రభంజ‌నం…ఉక్రెయిన్ అధ్య‌క్షుడిగా సంచ‌ల‌నం…

ఉక్రెయిన్ ప్ర‌స్తుతం యుద్ధంతో అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ నాటోలో స‌భ్య‌దేశంగా ఉండ‌కూడ‌దు అని ర‌ష్యా ష‌ర‌తు విధించ‌గా, దానికి ఉక్రెయిన్ తిర‌స్క‌రించ‌డం, నాటో కూడా ఉక్రెయిన్‌కు స‌పోర్ట్ చేయ‌డంతో యుద్ధం అనివార్య‌మైంది. ప్ర‌స్తుతం రెండు దేశాల మ‌ధ్య భీక‌ర పోరు జ‌రుగుతున్న‌ది. అయితే, ఉక్రెయిన్ అధ్య‌క్షుడిగా జెలెస్కీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత అక్క‌డి ప‌రిస్థితులు మ‌రింత దారుణంగా మారిపోయాయని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెస్కీ గురించి అనేక విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

Read: Smartphones: ప్ర‌పంచానికి స్మార్ట్‌ఫోన్ రాజ‌ధానిగా మార‌నున్న భార‌త్‌…

జెలెస్కీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క ముందు క‌మెడియ‌న్‌గా త‌న కేరీర్‌ను ప్రారంభించారు. 2010లో స‌ర్వెంట్ ఆఫ్ ది పీపుల్ అనే పాపుల‌ర్ టీవీ షో ద్వారా పాపుల‌ర్ అయ్యాడు. అంతకు ముందు జెలెస్కీ డాన్సింగ్ విత్ స్టార్స్ అనే రియాల్టీ షో లో పాల్గొని 2006 సీజ‌న్ విజేత‌గా నిలిచారు. ఒలెనా షాప్టెంకోతో క‌లిసి చేసిన డ్యాన్స్ అంద‌ర్ని ఆక‌ట్టుకున్న‌ది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.

Exit mobile version