చాలా మందికి పెళ్లి అవ్వక.. పిల్ల దొరక్క.. ఓ వైపు యువత నానా ఇబ్బందులు పడుతుంటే ఇతనేమో.. భలే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ఏదో ఫ్రట్ ని తినే వాటిని షేర్ చేస్తున్నట్లు అతగాడిని ఇద్దరు మహిళలు షేర్ చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్ లోని గ్యాలియర్ లో ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారంలో మూడు రోజులు ఒకరితో.. మరో మూడు రోజులు మరొకరితో ఉండేలా.. పరస్పర అంగీకరంతో ఓ అగ్రీమెంట్ చేసుకున్నారు. ప్రతీవారం అతని సమయాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఆ మహిళలు ఎంత మంచివాళ్లంటే.. అతనికి ఆదివారం రోజు స్వేచ్చగా ఫ్రెండ్స్ తో తిరిగేలా సెలవు కూడా ఇచ్చారు.
Also Read : Game On: ‘రిచో రిచ్’ సాంగ్ కు గుడ్ రెస్పాన్స్!
కరోనా దెబ్బకు మంది సొంతూళ్ల బాట పట్టారు. అయితే కచ్చితంగా ఆఫీస్ కు వెళ్లి జాబ్ చేయాల్సిన వాళ్లు మాత్రం ఉన్నచోటే ఉండిపోయారు. 28 ఏళ్ల సీమాకు హర్యానాలోని గురుగ్రామ్ లో పని చేస్తున్న ఓ ఇంజనీర్ తో 2018లో
పెళ్లి జరిగింది. రెండేళ్ల పాటు ఇద్దరు ఎంతో హ్యాపీగా ఉన్నారు. అయితే ఇంతలోనే కరోనా రావడం.. లాక్ డౌన్ పెట్టడంతో సీమాను తన పుట్టింట్లో వదిలిపెట్టాడు. ఇద్దరికీ అప్పుడే చిన్నబాటు ఉండటంతో.. కరోనా టైంలో సేఫ్ కాదని ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇదే సమయంలో ఆఫీస్ లో పని చేస్తున్న మరో మహిళకు అతను దగ్గరయ్యాడు. ఇద్దరు కలిసి ఒకే చోట ఉండటం మొదలు పెట్టారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ విషయాన్ని సీమకు తెలిశాయి. వెంటనే గురుగ్రామ్ వచ్చేసింది. భర్తతో గొడవ పడింది. ఇద్దరికీ అనేకసార్లు కౌన్సీలింగ్ ఇచ్చినా లాభం లేకపోయినా.. ఇద్దరిలో ఎవర్ని వదలలేనని భర్త తెగేసి చేప్పేశాడు. దీంతో సీమా కోర్టు గడప తొక్కింది.
Also Read : Pawan Kalyan: జనసేన దిగ్విజయ భేరి.. మేము సైతం అంటున్న డైరెక్టర్స్
తన కుమారుడి పెంపకం కోసం భర్త నుంచి ఆర్థిక సాయం కావాలని సీమా ఫ్యామిలీ కోర్టులో కేసు వేసింది. అయితే అక్కడే ట్విస్ట్ ఇచ్చింది. తన భర్తను ఆమెతో షేర్ చేసుకుంటానని చెప్పింది. వారంలో మూడు రోజులు తనతోనే ఉండాలని మరో మూడు రోజులు ఆమెతో ఉండొచ్చని తెలిపింది. సాధారణంగా ఇలాంటివి సినిమాల్లోనే జరుగుతాయి. ఇప్పుడు రెండు కుటుంబాలకు వేర్వేరు ఫ్లాట్లు ఉన్నాయి. ఈ ఘటనపై దేశం రకరకాలుగా చర్చించుకుంటోంది. అదృష్టమంటే అతనిదేనని కొందమంది అంటుండగా.. మరికొంత మంది మాత్రం ఒక భార్యతో పడలేక చస్తున్నామని.. ఇక ఇద్దరి భార్యలను ఎలా భరిస్తాడని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.