NTV Telugu Site icon

ట్విట్టర్ లో కొత్త ఫీచర్‌…కస్టమర్లకు గుడ్ న్యూస్

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తూనే వుంటుంది. ఇప్పటి వరకూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికల్లో షేరింగ్ ఆప్షన్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ ట్విట్టర్‌లో లేదు. ఇప్పుడు దీన్నే తీసుకొచ్చేందుకు కంపెనీ ఆలోచిస్తోందని తెలుస్తోంది. ఇలాంటి ఆప్షన్ కావాలని ఎప్పటినుంచో అడుగుతున్నారు. కానీ ఈ విషయం గురించి కంపెనీ ఇప్పుడే ఆలోచించింది.

Read Also సామాన్యుడితో ఆనంద్ మ‌హీంద్రా డీల్‌… ఎట్ట‌కేలుకు మ‌హీంద్రా రీసెర్చ్‌ వ్యాలీకి ఆ కారు…

మిగిలిన సోషల్ మీడియా సంస్థల కంటే భిన్నంగా తమకు నచ్చిన ట్వీట్లను షేర్ చేసుకునేలా ఈ ఫీచర్ డెవలప్ చేస్తోంది.ట్విట్టర్ యూజర్లు తమ స్నేహితుల్లో 150 మందిని ఒక గ్రూప్‌గా చేసుకోవచ్చు. దీన్ని ‘ట్విట్టర్ ఫ్లాక్’ అంటున్నారు. ఈ గ్రూప్‌తో మాత్రమే ట్వీట్లను షేర్ చేసుకునే వీలుంటుంది. ఈ గ్రూప్‌లో షేర్ చేసిన ట్వీట్లు ఈ గ్రూప్‌లోని సభ్యులు మాత్రమే చూసే అవకాశం వుంటుంది. అలాగే వారిలో వారు రిప్లై ఇవ్వగలుగుతారట. ఈ ఫ్లాక్‌ నుంచి ఎవరినైనా తొలగించినా సదరు సభ్యుడికి ఎటువంటి నోటిఫికేషన్ లభించదు. త్వరలోనే ఈ ఫీచర్‌ను ట్విట్టర్ అందుబాటులోకి తీసుకు రానుంది. దీనివల్ల ట్విట్టర్ మరింత అందుబాటులోకి వస్తుంది.