NTV Telugu Site icon

ఆ రాయి బ‌రువు 1.37 వేల కిలోలు… ఎంత బ‌ల‌హీనుడైనా స‌రే ఈజీగా ఎత్తేయ‌వ‌చ్చు…

సాధార‌ణంగా మ‌న బ‌రువుకంటే ఎత్తైన రాళ్ల‌ను ఎత్తాలి అంటే కొంత క‌ష్టమే. ఎంత‌టి బ‌లం ఉన్న వ్య‌క్తులైనా స‌రే కొంత మేర‌కు మాత్ర‌మే బ‌రువులు ఎత్త‌గ‌లుగుతారు. అయితే, ఫ్రాన్స్‌లోని హ్యూల్ గేట్ అనే అట‌వీ ప్రాంతంలో 1.37 ట‌న్నుల బ‌రువైన ఓ పెద్ద బండ‌రాయి ఉన్న‌ది. దానిని ఎవ‌రైనా స‌రే ఈజీగా ఎత్తివేయ‌వ‌చ్చ‌ట‌.   స‌మ‌త‌ల కోణంలో ఉన్న ఆ రాయిని ఒక ప‌క్క‌గా ఎత్తితే కొద్దిగా క‌దులుతుంది.  అంతేకాదు, ఇంకాస్త ప్ర‌య‌త్నిస్తే ఆ రాయిని పూర్తిగా ప‌క్క‌కు జ‌ర‌ప‌వ‌చ్చు.  ఎంత‌టి బ‌ల‌హీనుడైనా స‌రే కాస్త తెలివిగా ప్ర‌య‌త్నిస్తే ఈజీగా ఎత్తివేయ‌వ‌చ్చు.  అప్పట్లో శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తిన విధంగానే ఫ్రాన్స్ లోని హ్యూల్ గేట్ అటవీ ప్రాంతంలోని 1. 37 టన్నుల బరువైన బండరాయిని ఎవరైనా సరే ఎత్తి అవతల వేయవచ్చు . ఈ ప్రాంతాన్ని నిత్యం వేలాది మంది సందర్శిస్తుంటారు. 

Read: రైళ్ల‌లో ఎన్ని గేర్లు ఉంటాయో తెలుసా?