Site icon NTV Telugu

CC TV Evidence: దొంగల గుట్టురట్టుచేసిన సీసీ టీవీలు

Cctvs

Cctvs

ఎంతటి ఘరానా దొంగలయినా ఎక్కడో చోట ఆధారాలు మరిచిపోతుంటారు.. కొందరు దొంగలయితే ముఖానికి మాస్కులు పెట్టుకుని దొంగతనాలు చేస్తారు.. మరికొందరయితే దొంగతనరం చేస్తున్న టైంలో ఏదో ఒకటి మరిచిపోతుంటారు.. దొంగతనం చేసిన ఇంట్లోనే భోజనాలు చేసి మరీ ఆ తర్వాత దొరికిపోతారు. మహబూబాబాద్ జిల్లాలో ఈ దొంగల స్టయిలే సపరేటు. ఈ దొంగలు ఏ జ్యూయలరీ షాపునో, బాగా డబ్బులున్న వారినో టార్గెట్ చేయలేదు. ఏకంగా ఓ పాఠశాలనే టార్గెట్ చేశారు.

Read Also: Viral Video: హనుమంతుడి వేషధారణలో హుషారుగా డ్యాన్స్‌.. హఠాత్తుగా కుప్పకూలి..

ఆ స్కూల్లోని కంప్యూటర్ ల్యాబ్ తాళాలను పగుల గొట్టి 20 ల్యాప్ టాప్ లు , 5 కెమెరాలు, సెల్ ఫోన్ లు ఎత్తుకెళ్ళారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్.వి విద్యాలయంలో చోటుచేసుకుంది. దొంగలు స్కూళ్ళోకి ప్రవేశించి.. పాఠశాల లోని కంప్యూటర్ ల్యాబ్ తాళాలు పగులగొట్టారు. ముగ్గురు దొంగలు లోనికి ప్రవేశించారు, ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 20 ల్యాప్ టాప్ లతో పాటు 5 కెమెరాలు, ఒక సెల్ ఫోన్ చోరీ చేసిన దొంగలు అక్కడినించి జారుకున్నారు.

అయితే ప్లాన్ చేశారు కానీ పాఠశాల లో సి.సి. కెమెరాలు ఉన్న విషయాన్ని వారు మరిచిపోయారు. చోరీ చేసిన తీరు సీ.సీ కెమెరాలో రికార్డు అయిన సీసీ ఫుటేజ్ ల ఆధారంగా క్లూస్ టీo తో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Read Also: Tamilnadu: వైరల్ వీడియో.. ఓ సారూ.. నువ్వు ఎంతటి రసికుడివో తెలిసెరా..!!

Exit mobile version