NTV Telugu Site icon

Viral news : రైల్వే ట్రాక్ పై డ్యాన్స్ అదరగొట్టిన యువతి.. దారుణంగా నెటిజన్స్ ట్రోల్స్..

Dance Viral

Dance Viral

ఈ మధ్య జనాలు క్రేజ్ కోసం ఏదైనా చెయ్యడానికి రెడీ అవుతున్నారు.. జనాల దృష్టిని ఆకర్శించేందుకు మెట్రోలు, షాపింగ్ మాల్స్ లలో డ్యాన్స్ లు, వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు.. ఇప్పుడు క్రేజ్ కోసం రైల్వే ట్రాక్ లను ఎక్కుతున్నారు.. రీల్స్ కోసం రిస్క్ చేస్తున్నారు.. ఓ యువతి రైల్వే ట్రాక్ పై చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

రైలు పట్టాలపై ఓ యువతి చేసిన డ్యాన్స్ చూసి జనాలు షాకయ్యారు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో నీలంరంగు చీర ధరించి రైల్వే ట్రాక్ మధ్యలో నిలబడి హర్యాన్వీ పాటకు యువతి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో చూసిన వారంతా మండిపడ్డారు. ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.. ముంబై పోలీసులకు ట్యాగ్ చేస్తూ ఇలాంటి వారిని బయట ఉండనివ్వకూడదు అంటూ జనాలు మండిపడుతున్నారు..

ఇప్పటికే మెట్రో రైళ్లలో డ్యాన్సులు, వీడియోలు, ముద్దులు పెట్టుకోవడం, అభ్యంతరకరమైన వీడియోలతో కొంతమంది తోటి ప్రయాణికులకు ఇబ్బందిని కలిగిస్తున్నారు..అలాంటి ఘటనలు కూడా గతంలో చాలానే జరిగాయి.. దీంతో అలెర్ట్ అయిన అధికారులు మెట్రోల్లో పోలీసింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో యువత రైలు పట్టాలను కూడా వదలట్లేదు.. ఈ డ్యాన్స్ చేస్తున్న యువతిని కనిపెట్టి తిక్క కుదర్చాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు..