Site icon NTV Telugu

Viral Video : విద్యార్థినిపై మనసు పారేసుకున్న ఉపాధ్యాయుడు.. ఏం చేశాడంటే..?

Teacher Love Proposal

Teacher Love Proposal

ప్రేమ ఎప్పుడు.. ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. చిన్నతనం ప్రతి ఒక్కరూ క్రష్‌ ఉంటుందనేది తాజా ఆధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కొన్ని కొన్ని సార్లు ప్రేమను అడ్డంపెట్టుకొ అడ్డమైన పనులు కూడా చేస్తుంటారు కొందరు. అయితే ఓ ఉపాధ్యాయుడు తన దగ్గర ట్రైనింగ్‌ కోసం వచ్చిన విద్యార్థినిపై మనసు పారేసుకున్నాడు. అయితే ఇంకేముంది ఆ విద్యార్థినికి సినిమా స్టైల్‌లో లవ్‌ ప్రపోజ్‌ చేసేందుకు రెడీ అయ్యాడు. రోజులాగే ఆ రోజు కూడా ట్రైనింగ్‌కు వచ్చిన విద్యార్థినికి క్లాస్‌ రూంలోనే మోకాళ్లపై కూర్చోని లవ్‌ను ప్రపోజ్‌ చేశాడు. ఇదంతా క్లాస్‌ రూంలో ఉన్న మిగితా వారు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది. అంతా బాగానే ఉందిగానీ.. ఈ విషయం కాస్తా పై అధికారులకు తెలిసి తన ఉద్యోగాన్ని ఊడగోట్టారు. అంతేకాకుండా విద్యార్థినిని కూడా కొన్ని రోజుల పాటు సస్పెండ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. అసోంలోని ధామాజీ పట్టణానికి చెందిన మనోజ్ కుంబంగ్.. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ కౌశల్య యోచన ట్రైనింగ్ సెంటర్‌లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

అయితే అక్కడ ట్రైనింగ్‌కు వచ్చిన ఓ అమ్మాయి చూసి ప్రేమ పడ్డ మనోజ్‌ తన ప్రేమను వెల్లడించేందుకు సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈక్రమంలోనే ఓ రోజు తరగతి గదిలోనే సినిమాటిక్‌‌గా తన లవ్‌ను ప్రపోజ్ చేశాడు మనోజ్‌. చేతిలో పువ్వు పట్టుకుని మోకాళ్లపై కూర్చుని తన ప్రేమను అమ్మాయికి చెప్పాడు. ఈ తతాంగాన్ని క్లాస్ రూంలోని మిగతా విద్యార్థులు వీడియో తీసి సామాజిక మీడియాలో పోస్ట్‌ చేయడంతో తెగ వైరల్‌గా మారింది. మనోజ్‌కు ఆ అమ్మాయి ఒకే చెప్పిందో నో చెప్పిందో తెలియదు గానీ.. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు మనోజ్‌ను ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా.. ఆ అమ్మాయిని సస్పెండ్ చేశారు.

 

Exit mobile version