అది కాలేజీ ఈవెంట్. సీనియర్లు, జూనియర్లు అంతా ఆడిటోరియంలో కూర్చున్నారు. సీనియర్ అబ్బాయి.. జూనియర్ అమ్మాయి కలిసి డ్యాన్స్ చేసేందుకు సిద్ధపడ్డారు. మ్యూజిక్ స్టార్ట్ అయింది. కాళ్లు, చేతులు కదుపుతున్నారు. ఇంతలోనే సడన్‌గా రక్షాబంధన్ సాంగ్ స్టార్ట్ అయింది. దీంతో ఒక్కసారిగా ఇద్దరూ షాక్ అయ్యారు. ఆడిటోరియం అంతా కేకలు, అరుపులతో దద్దరిల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Kolkata doctor case: డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో 40 నిమిషాలు ఆలస్యం..
ఉత్తరాంచల్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు కాలేజీ ఈవెంట్‌లో నృత్య ప్రదర్శన చేపట్టారు. అయితే అబ్బాయి-అమ్మాయి కలిసి డ్యాన్స్ చేస్తుండగా సడన్‌గా రక్షాబంధన్ సాంగ్ ప్లే అయింది. అంతే వారిద్దరూ షాక్‌కు గురయ్యారు. ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా నవ్వేశారు. దీంతో వాళ్లిద్దరూ తలోదారి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
ఇది కూడా చదవండి: PM Modi: శనివారం 3 వందేభారత్ రైళ్లు ప్రారంభించనున్న మోడీ
ఇన్‌స్టాగ్రామ్‌లో సానియా రైత్వాన్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పటివరకు 28 మిలియన్లకు పైగా వీక్షించారు. వీడియోలో ఒక అబ్బాయి మరియు అమ్మాయి కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. వారి చుట్టూ ఉన్న విద్యార్థులు వారిని ఉత్సాహపరిచారు. ప్లే చేయబడిన పాట నిజానికి రక్షా బంధన్‌తో ముడిపడి ఉందన్న విషయం తెలియక కన్‌ఫ్యూజ్ అయ్యారు. విద్యార్థులంతా నవ్వుల్లో మునిగిపోయారు. సీనియర్ స్టూడెంట్ నవ్వుతూ డ్యాన్స్ ఫ్లోర్ నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో పట్ల నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.