NTV Telugu Site icon

తండ్రితో తాగుడును మాన్పించిన బాలుడు… ఎలాగో తెలుసా..!!

తండ్రి మ‌ద్యానికి బానిస కావ‌డంతో ఈ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ప‌డింది.  కుటుంబ‌స‌భ్యులు ఎన్నిసార్లు హెచ్చ‌రించినా ఆయ‌న మానుకోలేదు. తండ్రితో ఎలాగైనా మద్యాన్ని మాన్పించాల‌ని 13 ఏళ్ల కుమారుడు నిర్ణ‌యించుకున్నాడు.  వెంట‌నే ప్లాన్ ను సిద్ధం చేసుకున్నాడు.  త‌న తండ్రి మ‌ద్యానికి బానిస అయ్యాడ‌ని, త‌న కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందులు ప‌డుతోంద‌ని, త‌న, త‌న సోద‌రి చ‌దువుకు ఇది విఘాతంగా మారిందని గ్రామ స‌భ‌లోని పెద్ద‌ల‌కు ఫిర్యారు చేశాడు.  త‌న సోద‌రిని ఎలాగైనా డాక్ట‌ర్‌ను చేయాల‌ని అనుకుంటున్నాన‌ని, తండ్రి ఇలా తాగుడుకు బానిసైతే దాని వ‌ల‌న ఇబ్బందులు ప‌డాల్సి ఉంటుంద‌ని బాలుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.  

Read: విజయవాడలో భారీ వర్షం.. జలమయమైన రహదారులు

13 ఏళ్ల బాలుడు అంకుశ్ రాజు చేసిన ఫిర్యాదును పెద్ద‌లు కొట్టిపారెయ్య‌లేదు.  అందులోని నిజాయితీని గ్ర‌హించి మ‌ద్యానికి బానిసైన తండ్రిని పిలిపించి మ‌ట్లాడారు.  మ‌ద్యం సేవించ‌డం మానుకోవాల‌ని ఆదేశించారు.  గ్రామపెద్ద‌లు చెప్ప‌డంతో తాగుడు మానుకుంటాన‌ని మాట ఇచ్చాడు.  తండ్రిని మద్యం నుంచి మాన్పించ‌డం కోసం బాలుడు చేసిన ప్ర‌య‌త్నాన్ని గ్రామ పెద్ద‌లు మెచ్చుకొని బాలుడికి ఘ‌నంగా స‌న్మానం చేశారు.  ఈ సంఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని యావ‌త్మల్ జిల్లాలోని అర్జీ తాలుకాలోని లోన్‌బెహ‌ల్ గ్రామంలో జ‌రిగింది.