తమిళనాట యువ దంపతుల వివాహ ఆహ్వన పత్రిక వైరల్ గా మారింది. సేలం జిల్లా అమాని గ్రామానికి చెందిన వరుడి పేరు సోషలిజం కాగా.. అదే గ్రామానికి చెందిన వధువు పేరు మమతా బెనర్జీ కావడం విశేషం. వీరిద్దరికి రేపు ఉదయం వివాహం జరుగనుంది. కాగా వరుడి కుటుంబం కమ్యూనిస్ట్ భావాలు కలిగిన కుటుంబం కావడంతో కుమారుడికి కూడా ఆ స్ఫూర్తిని కలిగించేలా పేరు పెట్టారట. ప్రస్తుతం సీపీఐ సేలం జిల్లా కార్యదర్శిగా వరుడు తండ్రి లెనిన్ మోహన్ వ్యవహరిస్తున్నాడు.ఇక వధువు మమతా బెనర్జీ.. ఆమె తాత కాంగ్రెస్ వాది కాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మీద మక్కువతో ఆ పేరు పెట్టారట. ముందు తరాలకు తమ భావాలను అందించేందుకే ఈ పేర్లను పెట్టినట్లు చెప్పుతున్నారు. మరో విశేషమేమిటంటే, సోషలిజం-మమతా బెనర్జీ జంటకు ఆడపిల్ల పుడితే ‘క్యూబాయిజం’ అని పేరు పెడతామని చెప్తున్నారు. అయితే ఆ గ్రామంలో కమ్యూనిజం మీద ప్రేమతో చాలా మంది ఈ విధమైన పేర్లు పెట్టుకుంటారట.
వైరల్: మమతా బెనర్జీకీ సోషలిజంతో పెళ్ళి
