Site icon NTV Telugu

Contact Lens: వామ్మో కళ్ళలో ఏకంగా 23 లెన్స్‌లు.. ఆశ్చర్యపోయిన డాక్టర్‌

Contact Lens

Contact Lens

Contact Lens: కంటి చూపు తక్కువగా ఉన్నవారు ఎక్కువగా అద్దాలు ధరిస్తారు. కానీ కొంతమంది తమ ముఖాన్ని అందవిహీనంగా మార్చుకోకుండా కళ్లలో కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకుంటారు. వీటిని ధరించడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని చెబుతారు. కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకోవడం కొంచెం కష్టం ఉంటుంది.. మీరు వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని మీ కంటిలో పెట్టుకుని నిద్రపోకండి. అలా చేస్తే అవి కళ్లలోకి వెళ్లి ఇబ్బంది కలిగించి ఇతర సమస్యలకు దారితీస్తాయి. కానీ, ఓ మహిళ రోజూ కాంటాక్ట్ లెన్సులు పెట్టుకుంటోంది కానీ వాటిని తీయడం మరిచిపోతోంది. అవి కంటిలో అలాగే వుండిపోయాయి. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 23 లెన్స్ లు పెట్టి కంటికి వదిలేసింది. చివరికి ఏమైందో తెలుసా..!

కాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళకు కాంటాక్ట్ లెన్సులు ధరించడం అలవాటు. అలా ప్రతిరోజూ వాటిని పెడుతూనే ఉంది. కానీ వాటిని తొలగించడం మర్చిపోతుంది. మళ్లీ కొత్త కాంటాక్ట్ లెన్స్ కొనడం ధరించడం ఇలా ఆమె దాదాపు 23 లెన్సులు పెట్టుకుంది. ఆ.. లెన్స్‌ అన్నీ కనురెప్ప కింద ఉండిపోయాయి. ఒకరోజు ఆమె కంటిలో విపరీతమైన నొప్పి రావడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు ఆమె కంటిలో 23 లెన్స్‌లను చూసి ఆశ్చర్యపోయాడు.

Read also: Bhanu Saptami Special Pooja Live: భాను సప్తమినాడు ఈ స్తోత్రాలు వింటే..

ఆవైద్యుడు వాటిని ప్రత్యేక పరికరంతో విజయవంతంగా తొలగించాడు. లెన్స్‌లు ఒకదానికొకటి అతుక్కొని కనురెప్పల క్రింద ఉండిపోయాయి. ఓ డాక్టర్ ఆమె కంటిలో నుంచి లెన్స్‌ తీస్తున్న వీడియోను సదరు డాక్టర్‌ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఒళ్లు గగుర్బురిచే ఈవీడియోను చూసిన మీక్కూడ మైండ్‌ బ్లాంక్‌ అవుతుంది. కంటి నుంచి తీసిన లెన్స్‌ పచ్చగా మారిపోయాయి. కంటి లోపల అతుక్కుపోయిన ఆలెన్స్‌ ను తీస్తున్న డాక్టరే నిర్ఘాంతపోయాడు.

లెన్స్ తీస్తున్న వీడియో..

Exit mobile version