Site icon NTV Telugu

Whatsapp: ఇలాంటి ఎమోజీలు పంపితే… భారీ జ‌రిమానా త‌ప్ప‌దు..

సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌తి ఒక్క‌రూ ఇంట‌ర్నెట్‌కు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా వాట్సాప్ తోనే కాలం గ‌డిపేస్తున్నారు. కేవ‌లం మెసేజ్‌లు, ఇమేజ్‌లు, వీడియోలు మాత్ర‌మే కాకుండా మ‌న భావాల‌కు సంబంధించి ఎమోజీల‌ను పోస్ట్ చేసుకునే అవ‌కాశం ఉన్న‌ది. దీంతో చాలా మంది వివిధ ర‌కాల ఎమోజీల‌ను వినియోగిస్తున్నారు. అయితే, వాట్సాప్ యూజ‌ర్ల‌కు సౌదీ అరేబియా గ‌ట్టి షాక్ ఇస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై వాట్సాప్ చాట్‌లో రెడ్ హార్ట్ ఎమోజీల‌ను పంపితే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది.

Read: Tesla: భార‌త ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్‌…

ఎవ‌రైనా స‌రే రెడ్ హార్ట్ ఎమోజీల‌ను క‌నుక పంపితే రూ. 20 ల‌క్ష‌ల జ‌రిమానా విధిస్తామ‌ని హెచ్చిరించింది. అంతేకాదు, రెండు నుంచి ఐదేళ్ల‌పాటు జైలుశిక్ష విధించే అవ‌కాశం కూడా ఉందని సౌదీ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీల‌ను వేధింపుల‌తో స‌మానంగా చూస్తారు. వాట్సాప్‌లోని కొన్ని ఎమోజీల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో కూడా వాడ‌కూడ‌ద‌ని సౌదీ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

Exit mobile version