NTV Telugu Site icon

విచిత్రం: ఆప్రాంతంలో మంచు న‌ల్ల‌గా కురుస్తోంది… ఇదే కార‌ణం…

సాధార‌ణంగా ర‌ష్యాలాంటి శీత‌ల దేశాల్లో మంచు కుర‌వ‌డం స‌హ‌జ‌మే. మంచు అంటేనే తెల్ల‌గా ఉంటుంది. కానీ, ఆ ప్రాంతంలో కురిసే మంచుమాత్రం న‌ల్ల‌గా ఉంటుంద‌ట‌. దీనిక కార‌ణం లేక‌పోలేదు. మంచు విప‌రీతంగా కురిసే ఓంసుచ‌న్ అనే ప్రాంతంలో ప్ర‌జ‌ల‌కు వేడిని అందించేందుకు బొగ్గుతో న‌డిచే ఓ ప్లాంట్‌ను నిర్మించారు. ఇక్క‌డ సుమారు నాలుగువేల మందికి ఆ బొగ్గుఆధారిత ప్లాంట్ ద్వారా వేడి ల‌భిస్తుంది. బొగ్గు కాల్చేస‌మ‌యంలో వెలువ‌డే పొగ‌కార‌ణంగా ఆ ప్రాంతంలో నిత్యం న‌ల్ల‌ని దుమ్ముపేరుకుపోయి క‌నిపిస్తున్న‌ది. మంచు ఓంసుచ‌న్ వాతావ‌ర‌ణంలోకి ప్ర‌వేశించ‌గానే దుమ్ముధూళి కార‌ణంగా న‌ల్ల‌గా మారిపోతుంది. దుమ్ముధూళితో క‌లిసి న‌ల్ల‌గా మారి కురుస్తున్న‌ది. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎక్క‌డ చూసినా న‌ల్ల‌ని మంచే క‌నిపిస్తున్న‌ది. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Read: 23 అంశాలను పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తాం : ఎంపీ రంజిత్‌రెడ్డి